TGRJC CET 2026: తెలంగాణ రాష్ట్రంలోని జనరల్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలతో పాటు, 93 కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) ల్లో 2026-27 విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం నిర్వహించే టిజి ఆర్ జేసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టిజిఆర్జేసీ సెట్)-2026 దరఖాస్తు గడువు నేటి (బుధవారం) తో ముగియనుంది.
పరీక్షకు ఇప్పటి వరకు 60 వేల దరఖాస్తు చేసుకున్నట్టు తెలంగాణ గురుకుల సొసైటీ సెక్రటరీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 3న పరీక్షను నిర్వహించనున్నారు.
The TGR JC application deadline ends today.
TGRJC CET 2026: 35 రెసిడెన్షియల్ కాలేజీలు, 93 కెజివిబిల్లో అడ్మిషన్లు
టిజిఆర్ జేసీ సెట్- 2026 ద్వారా 35 తెలంగాణ గురుకుల (రెసిడెన్షియల్) జూనియర్ కాలేజిలలో, 93 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, (ఇంగ్లీషు మీడియం. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో) ప్రవేశము కొరకు మే 32 పరీక్షను నిర్వహించనున్నట్టు తెలిపారు. 2026 మార్చిలో గడువు జరిగిన 10వ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను మార్చి 16 నుంచి స్వీకరించడం ప్రారంభించారు. నేటి(ఏప్రిల్ 15) దరఖాస్తు ముగియనుంది.
ఎంపిక ప్రక్రియ
దరఖాస్తు ఫీజును రూ.200గా నిర్ణయించారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా రిజర్వేషన్ ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. ఇతర వివరాల కొరకు టిజిఆర్జేసీ అధికారిక వెబ్సైట్లో చూడాలని, ఇతర వివరాల కోసం 040-24734899, 7842991708, 1800 425 2428 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ప్రకటనలో సూచించారు. 35 గురుకుల కాలేజీల్లో 3000 సీట్లు అందుబాటులో ఉండగా.. 93 కేజీబీవీల్లో 3700 సీట్లు అందుబాటులో ఉన్నట్టు సెక్రటరీ తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

