Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నెయ్యి, వెన్న ధరలు భారీగా పెంపు!

నెయ్యి, వెన్న ధరలు భారీగా పెంపు!

వార్త 2 weeks ago

Dairy organization Amul : ప్రముఖ డైరీ సంస్థ అమూల్ పండక్కి ముందే ప్రజలకు షాక్ ఇచ్చింది. అమూల్ తన నెయ్యి, వెన్న ఉత్పత్తుల రిటైల్ ధరలను దేశవ్యాప్తంగా పెంచింది.

దీని ప్రకారం 1 కిలో నెయ్యి ప్యాకెట్ ధర రూ. 50, 500 గ్రాముల వెన్న ప్యాకెట్ ధర రూ. 15 పెరిగాయి. ఈ కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. ఉత్పత్తుల లేబుళ్లపై, అలాగే ఆన్‌లైన్ రిటైల్ ప్లాట్‌ఫారమ్‌లలో అప్‌డేట్ చేసినట్లు అమూల్ ప్రకటించింది. తాజా సవరణల తర్వాత, 1 కిలోల అమూల్ నెయ్యి ప్యాకెట్ ధర గతంలో ఉన్న రూ. 630 నుంచి రూ. 680కి పెరిగింది. అలాగే, 500 గ్రాముల స్వచ్ఛమైన నెయ్యి ప్యాకెట్ ధర రూ. 325 నుంచి రూ. 345కి (రూ. 20 పెంపు) చేరింది. కంపెనీ తన వెన్న ప్యాకెట్ల ధరలను కూడా సవరించింది. గతంలో రూ. 63గా ఉన్న 100 గ్రాముల వెన్న ప్యాకెట్ ధర ఇప్పుడు రూ. 66కి పెరిగింది.

Shreya Ujjwal Wedding: ఒకే వేదికపై జగన్, విజయ్, కేటీఆర్.. చెన్నై పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణ

 Dairy organization Amul

Dairy organization Amul: ఇంధన ధరలు పెరగడం వల్ల ధరలు పెంపు

అంతకుముందు ఈ ఏడాది మే నెలలో అమూల్ తన తాజా పాల ప్యాకెట్ల ధరలను లీటరుకు రూ. 2 చొప్పున పెంచింది. మే 14 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పెంపు, గోల్డ్, తాజా, శక్తి, ఆవు పాలు వంటి ప్రధాన రకాల పాలపై వర్తించింది. అప్పట్లో, అమూల్ బ్రాండ్ పేరుతో ఉత్పత్తులను విక్రయించే ‘గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్’ (GCMMF), పశుగ్రాసం, ప్యాకేజింగ్ సామాగ్రి, ఇంధన ధరలు పెరగడం వల్ల పాల ధరలను సవరించాల్సి వచ్చిందని పేర్కొంది.

Read Also hindi news: hindi.vaartha.com

చెవిరెడ్డికి చుక్కలు చూపించిన MLA సతీమణి సుధారెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha