Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒకే వేదికపై జగన్, విజయ్, కేటీఆర్.. చెన్నై పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణ

ఒకే వేదికపై జగన్, విజయ్, కేటీఆర్.. చెన్నై పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణ

వార్త 2 weeks ago

Shreya Ujjwal Wedding: వైసీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతి చెన్నైలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు.

నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, వ్యాపార, సినీ రంగ ప్రముఖులు హాజరుకావడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Read Also :Polling : రాత్రికి రాత్రే పోలింగ్ ఎలా పెరిగింది - జగన్

వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహానికి జగన్ దంపతులు

జగన్ బంధువు వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ వివాహం ఉజ్వల్‌తో గురువారం చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు జగన్, భారతి హాజరై వేదికపై నూతన జంటకు పుష్పగుచ్ఛాలు అందించారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు.

ఒకే వేదికపై జగన్, విజయ్, కేటీఆర్

ఈ వివాహ వేడుకలో పలువురు ప్రముఖులు ఒకే వేదికపై కనిపించారు. జగన్‌తో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. ముగ్గురు నేతలు ఒకే వేడుకలో పాల్గొనడం అక్కడి అతిథుల దృష్టిని ఆకర్షించింది. జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి తదితరులు కూడా వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

Shreya Ujjwal Wedding: విజయ్‌తో కలిసి వచ్చిన త్రిష

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రముఖ నటి త్రిషతో కలిసి ఈ వివాహ వేడుకకు హాజరైనట్లు సమాచారం. వారిద్దరూ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ, వ్యాపార, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు ఒకే చోట చేరడంతో ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలపై సోషల్ మీడియాలో ఆసక్తి నెలకొంది.

చెవిరెడ్డికి చుక్కలు చూపించిన MLA సతీమణి సుధారెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha