Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నీ సొల్లు కబుర్లు..అక్కడ చెప్పుకో - పొన్నం కు బొలిశెట్టి కౌంటర్

నీ సొల్లు కబుర్లు..అక్కడ చెప్పుకో - పొన్నం కు బొలిశెట్టి కౌంటర్

వార్త 3 weeks ago

Bolisetti Srinivas : తెలంగాణ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల మధ్య చెలరేగిన రాజకీయ వివాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.

తెలంగాణ తమ జాగీరని, పవన్ కల్యాణ్ జాగీరు కాదంటూ పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “అసలు నువ్వెవరు పొన్నం? నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున మాట్లాడటానికి నీకేం హక్కు ఉంది?” అంటూ బొలిశెట్టి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా సూటిగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఏ ప్రాంతం ఎవరి సొంత జాగీరు కాదని, ప్రజలందరికీ దేశంలో ఎక్కడైనా తిరిగే, మాట్లాడే స్వేచ్ఛ ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

Read Also : రాజకీయ సెగలు రేపుతున్న ట్వీట్

ఈ వివాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ, బొలిశెట్టి శ్రీనివాస్ మంత్రి పొన్నం ప్రభాకర్‌పై తీవ్రమైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ అంతగా తన జాగీరు అని భావిస్తే.. రాష్ట్ర సరిహద్దుల్లో కూర్చొని, వచ్చిపోయే ప్రయాణికులకు ఈ సొల్లు కబుర్లు చెప్పుకోవాలంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ జాతీయవాదం, ప్రాంతీయతపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వడం, దానికి ప్రతిగా జనసేన ఎమ్మెల్యేలు అంతకంటే తీవ్రంగా బదులిస్తుండటంతో కాంగ్రెస్ వర్సెస్ జనసేన వివాదం మునుపెన్నడూ లేని విధంగా ముదిరిపాకాన పడింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

చెరువు కబ్జా ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన పవన్ కళ్యాణ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha