Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిలిపి ఉంచిన లారీని ఢీకొన్న వ్యాన్.. చికిత్స పొందుతూ వ్యక్తి మరణం

నిలిపి ఉంచిన లారీని ఢీకొన్న వ్యాన్.. చికిత్స పొందుతూ వ్యక్తి మరణం

వార్త 1 week ago

Visakhapatnam road accident: విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం పెద్దిపాలెం హైవే వంతెనపై బుధవారం తెల్లవారుజామున ఒక భయంకర ప్రమాదం చోటుచేసుకుంది.

వేగంగా వెళ్తున్న ఓ వ్యాన్.. అదే దారిలో ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

Read also: Nara Lokesh: మొబైల్స్ నుంచి కార్ల వరకు అంతా ఏపీలోనే.. మంత్రి నారా లోకేష్

 Road accident at Visakha Anandapuram

Visakhapatnam road accident: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

ప్రమాద సమయంలో వ్యాన్ లో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి అంబులెన్స్ సహాయంతో అతడిని తగరపువలసలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మరణించాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు

మరణించిన వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha