Rice prices:తెలంగాణ రాష్ట్రంలో నిల్వలు నిండుగా ఉన్నప్పటికీ కొందరు వ్యాపారులు కావాలనే సృష్టిస్తున్న తెలంగాణలో బియ్యం కృత్రిమ కొరత కారణంగా సామాన్య ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోంది.
గత రికార్డు స్థాయి దిగుబడులతో 2025-26 నాటికి ధాన్యం ఉత్పత్తి ఏకంగా 148.30 లక్షల టన్నులకు చేరినప్పటికీ, ఇప్పుడు మార్కెట్లో సన్న రకం బియ్యం దొరకడం లేదు. గతేడాది చివరి వరకు కిలో 45 నుండి 50 రూపాయలు, మేలు రకాలు 60 నుండి 65 రూపాయలకు లభించేవి. కానీ ఇప్పుడు కేవలం మూడు నెలల కాలంలోనే 30 నుండి 40 శాతం వరకు ధరలు పెంచి కిలో 60 నుండి 85 నుండి 90 రూపాయల వరకు విక్రయిస్తున్నారు.
Telangana Electricity: 12 గంటల కరెంట్ తెలంగాణలోనే సాధ్యం
rice artificial shortage in telangana
భవిష్యత్తును సాకుగా చూపుతూ బ్లాక్ మార్కెట్ దందా
2019-20లో కేవలం 72 లక్షల టన్నుల దిగుబడి ఉన్న సమయంలో సాధారణంగా ధరలు తగ్గాలి కానీ మిల్లర్లు హోల్‌సేల్ వ్యాపారులు లక్షల టన్నుల సన్న బియ్యాన్ని గోదాముల్లో అక్రమంగా దాచేశారు. 2027 ఏప్రిల్ నుండి జూన్ మధ్య వచ్చే ఎల్ నినో ప్రభావం పంటలపై పడుతుందనే భవిష్యత్తు సాకును అడ్డుపెట్టుకుని కొందరు ఇప్పుడే బ్లాక్ మార్కెట్ దందాకు తెరతీశారు. గతంలో ప్రభుత్వం 5 లక్షల టన్నుల సన్నవడ్లను వేలం వేసినప్పుడు కనీస ధరకు కూడా కొనడానికి ముందుకు రాని వారే ఇప్పుడు కృత్రిమ కొరతను సృష్టించి రిటైల్ దుకాణాలలో బస్తాల కొద్దీ నిల్వలు ఉంచి రోజుకో రేటుతో దోపిడీకి పాల్పడుతున్నారు.
Rice prices:నిబంధనలకు తూట్లు పొడుస్తూ అధికారుల తనిఖీల అవసరం
ప్రైవేట్ బియ్యం వ్యాపార కార్యకలాపాల కోసం నిర్వహించాల్సిన బి రిజిస్టర్ రికార్డులను ఎక్కడా సరిగ్గా పాటించడం లేదు అలాగే దుకాణాల వద్ద నిల్వలు అమ్మకపు ధరల వివరాలతో కూడిన బోర్డులను కూడా ఏర్పాటు చేయడం లేదు. పంట పండించిన రైతులకు ఈ ధరల పెరుగుదల ద్వారా ఎలాంటి ప్రయోజనం దక్కకపోగా సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి అక్రమ గోదాములపై దాడులు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే మార్కెట్లో ధరలు అదుపులోకి వచ్చి వినియోగదారులకు ఊరట లభిస్తుంది.
Epaper: epaper.vaartha.com

