DJ Issues During Ganesh Immersion : గణేష్ నిమజ్జనాలు, పండుగలు మరియు వివాహ వేడుకల్లో వినియోగిస్తున్న డీజే శబ్దాలు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి.
సరదాగా డ్యాన్స్ చేస్తూ, ఊరేగింపుల్లో పాల్గొంటున్నవారు హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిమ్స్ హృద్రోగ నిపుణులు డాక్టర్ సాయి సతీశ్ వివరాల ప్రకారం, ఈ భారీ శబ్దాలు చెవి వినికిడి శక్తిని దెబ్బతీయడమే కాకుండా ప్రాణాంతకమైన కార్డియాక్ అరెస్టుకు దారితీస్తున్నాయి. సాధారణంగా మనుషులు 60 నుండి 70 డెసిబెల్స్ (dB) వరకు శబ్దాన్ని సురక్షితంగా వినగలరు. కానీ ఈవెంట్లలో వాడే డీజే సిస్టమ్స్ 100 నుండి 120 డెసిబెల్స్ వరకు శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. డీజే స్పీకర్ల పక్కన నిలబడటం వల్ల ఈ శబ్ద తరంగాల ఒత్తిడి నేరుగా కర్ణభేరిని తాకి, లోపలి సున్నితమైన నరాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల తాత్కాలికంగా లేదా శాశ్వతంగా వినికిడి లోపం తలెత్తడమే కాక, కర్ణభేరి పగిలిపోయే ప్రమాదం కూడా ఉంది.
Laxma Reddy: రైతుల కష్టాలు కనపడవా..?
DJ Issues During Ganesh Immersion
DJ Issues During Ganesh Immersion : గుండె ఆరోగ్యంపై డీజే తీవ్ర ప్రభావం
అధిక శబ్దాల వల్ల శరీరంలో ‘అడ్రినలిన్’ (Adrenaline) అనే హార్మోన్ హఠాత్తుగా విడుదలై, గుండె వేగాన్ని మరియు రక్తపోటును ఒక్కసారిగా పెంచుతుంది. ఇదివరకే గుండె నాళాల్లో అడ్డంకులు ఉన్నవారు, పేస్‌మేకర్ అమర్చుకున్నవారు, మరియు అరుదైన ‘లాంగ్ క్యూటీ సిండ్రోమ్’ (Long QT Syndrome) సమస్య ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం. రక్తపోటు తీవ్రమై గుండె కింది గదులు రక్తాన్ని సరైన మోతాదులో పంప్ చేయలేక, క్షణాల్లో కార్డియాక్ అరెస్టు సంభవించే అవకాశాలు ఉన్నాయి. గతేడాది బతుకమ్మ వేడుకల్లో డీజే శబ్దాల మధ్య డ్యాన్స్ చేస్తూ ముగ్గురు మహిళలు హఠాత్తుగా కుప్పకూలి చికిత్స పొందుతూ మరణించారు. స్నేహితుని పెళ్లిలో డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ 17 ఏళ్ల యువకుడు హఠాత్తుగా కిందపడి, గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.
ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. వారం రోజుల్లో ఇంట్లోకి రాకపోతే కేటాయింపు రద్దు

