Laxma Reddy: రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద ఏది?
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి.. జూరాల రైతులకు అండగా బీఆర్ఎస్ ధర్నా పిలుపు. తిరుమల హిల్స్ లో లక్ష్మారెడ్డి హౌస్ అరెస్ట్కాం గ్రెస్ ప్రభుత్వానికి రైతుల కష్టాలు కనపడట్లేదని, రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మండిపడ్డారు.
జూరాల ఆయకట్టు రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పిలుపునిచ్చిన ధర్నా నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అప్పన్నపల్లి సమీపంలోని తిరుమలహిల్స్ లోని నివాసంలో మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులను మాజీ మంత్రి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. జూరాల ఆయకట్టు రైతులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ ధర్నాకు పిలుపునిచ్చిందని, ఆయకట్టు రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ధర్నాకు వెళ్దామంటే పోలీసులు ఎక్కడికక్కడ మాజీ ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి అవగాహన లేదు, సాగునీరు ఇవ్వాలనే ఆలోచన లేదన్నారు. జూరాలలో ఈ రోజుకి 8.5 టీఎంసీల నీళ్లు ఉన్నాయని, లక్షా పది వేల ఎకరాల్లో పంటలు సాగు అవుతున్నా..పంటలకు సడన్ గా నీటి విడుదల నిలిపివేయడం ఏంటని ప్రశ్నించారు. పంటలు కాపాడే అవకాశం ఉన్నప్పటికీ నీళ్లు ఇవ్వట్లేదని, ప్రభుత్వం తెలివి, అవగాహన లేక డ్రింకింగ్ వాటర్ కోసం ఆపుతున్నామని చెప్తున్నారని మండిపడ్డారు.
Read Also :Khairatabad Bypoll: ఖైరతాబాద్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థిగా తలసాని కుమారుడు?

Laxma Reddy: పంటలు వేయొద్దని ముందే రైతులను ప్రభుత్వం హెచ్చరించాల్సి ఉండేదని, కానీ పంటలు సాగు చేశాక నీళ్లు ఇవ్వకపోతే ఎలా? లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టిన రైతులు ఎక్కడికి పోవాలన్నారు. ఎగువన కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ ఉందని, కర్ణాటక ప్రాజెక్టులలో నీళ్లు నిండా ఉన్నాయి, కర్ణాటకకు అడిగి నీళ్లు తీసుకునే వెసులుబాటు ఉందన్నారు. పంటలు ఎండిపోతున్నాయి, పంటలను కాపాడండని కోరారు. సాగునీటితో పాటు విద్యుత్ సమస్యలు మరోవైపు అన్నదాతలను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి అన్నారు. ఆరు గంటలకు మించి విద్యుత్ సరఫరా కావట్లేదని, తమ హయాంలో ఎప్పుడైనా విద్యుత్ సమస్యలు చూశామా..? అని అన్నారు. మూడేళ్ల తర్వాత కూడా కేసీఆర్ ను తిట్టడమే సరిపోతుందని, కేసీఆర్ ముందుచూపుతో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ చేపట్టారు, ఆ పనులు పూర్తి చేయకుండా పెండింగ్ పెట్టారు అని మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. వారం రోజుల్లో ఇంట్లోకి రాకపోతే కేటాయింపు రద్దు

