Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నింగిలోకి హైదరాబాద్ రాకెట్ 'విక్రమ్-1'.. జెండా ఊపిన సీఎం రేవంత్!

నింగిలోకి హైదరాబాద్ రాకెట్ 'విక్రమ్-1'.. జెండా ఊపిన సీఎం రేవంత్!

వార్త 2 months ago

Vikram-1 Rocket Launch: తెలంగాణ రాష్ట్రం అంతరిక్ష రంగంలో మరో అద్భుత మైలురాయిని అధిగమించింది. శనివారం (ఏప్రిల్ 25) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ - స్కైరూట్ ఏరోస్పేస్ కు చెందిన 'విక్రమ్-1' ఫ్లైట్ హార్డ్‌వేర్‌ను జెండా ఊపి ప్రారంభించారు.

మ్యాక్స్-క్యూ క్యాంపస్‌లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమం తెలంగాణ ఏరోస్పేస్ సత్తాను చాటిచెప్పింది.

హైదరాబాద్‌లోనే పూర్తిస్థాయిలో డిజైన్ మరియు అభివృద్ధి చేయబడిన ఈ విక్రమ్-1 రాకెట్, ప్రయోగం నిమిత్తం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి(SDSC) బయలుదేరింది. రాబోయే కొద్ది నెలల్లోనే స్కైరూట్ సంస్థ తన మొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ ప్రయత్నాన్ని చేపట్టనుంది. 2022లో తన తొలి ప్రయోగాన్ని విజయవంతం చేసిన స్కైరూట్, ఇంత తక్కువ సమయంలోనే ఈ స్థాయికి చేరుకోవడంపై సీఎం ప్రశంసలు కురిపించారు.

Read Also : Kavitha New Party: TRS పేరుతో కొత్త పార్టీ.. బీఆర్ఎస్‌కు కష్టాలు తప్పవా?

Vikram-1 Rocket Launch: ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ నంబర్ వన్

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. బోయింగ్, ఎయిర్‌బస్, సఫ్రాన్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు ఇప్పటికే మన రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 2047 నాటికి తెలంగాణను ఏరోస్పేస్ రంగంలో గ్లోబల్ లీడర్‌గా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం” అని ధీమా వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2023-24, 2024-25 మధ్యకాలంలో ఇంజనీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణ 117.9 శాతం అత్యధిక వృద్ధిని నమోదు చేసిందని సీఎం వెల్లడించారు. ఇందులో విమాన విడిభాగాలు, రక్షణ పరికరాల వాటా ప్రధానంగా ఉందని, రాబోయే రోజుల్లో హైదరాబాద్ ‘స్పేస్ హబ్’గా మారుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్కైరూట్ బృందాన్ని సీఎం ప్రత్యేకంగా అభినందించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

కన్నుల పండుగగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha