PMO's concern over NEET re-exam: నీట్ పరీక్ష నిర్వహణలో గతంలో జరిగిన లోపాలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం, ఈసారి ఎలాంటి తప్పులకు తావులేకుండా అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తుండటం విశేషం. ఈ కీలక పరిణామాల ముఖ్యాంశాలు.
Read Also: Maharashtra Crime: హత్యకు గురైందనుకున్న యువతి సజీవంగా ప్రత్యక్షం..ఎక్కడంటే?
PMO’s concern over NEET re-exam
మిలిటరీ స్థాయి భద్రత: నీట్ రీఎగ్జామ్ పారదర్శకంగా, లీకేజీలకు తావులేకుండా నిర్వహించేందుకు తొలిసారిగా భారత సైన్యాన్ని (Army) రంగంలోకి దించుతున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద, నిఘా విభాగాలలో ఆర్మీ పర్యవేక్షణ ఉండనుంది. ప్రశ్నాపత్రాల (Question Papers) రవాణాలో అత్యంత గోప్యత, భద్రతను పాటించేందుకు భారత వైమానిక దళాన్ని ఉపయోగించనున్నారు. దీనివల్ల రవాణా సమయంలో పేపర్ లీక్ అయ్యే అవకాశాలు పూర్తిగా శూన్యమవుతాయి. ప్రశ్నాపత్రాల రూపకల్పన, ప్రింటింగ్, రవాణా నుండి జిల్లాలకు పంపిణీ చేసే వరకు ప్రతి దశను ప్రధానమంత్రి కార్యాలయం (PMO) నేరుగా పర్యవేక్షించనుంది. జూన్ 14న అడ్మిట్ కార్డులు (Admit Cards) జారీ చేయనుండగా, జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్ రీఎగ్జామ్ జరగనుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
ట్రబుల్ షూటర్ నుంచి సీఎం వరకు.. డీకే శివకుమార్ రాజకీయ ప్రస్థానం

