Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ఫలితాల తేదీని వెల్లడించిన ఎన్‌టీఏ!

నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ఫలితాల తేదీని వెల్లడించిన ఎన్‌టీఏ!

వార్త 3 weeks ago

NEET UG 2026 Results: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ యూజీ (NEET UG 2026) పునఃపరీక్ష ఫలితాల విడుదలపై జాతీయ పరీక్షల ఏజెన్సీ (NTA) కీలక అప్‌డేట్ ఇచ్చింది.

పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో గత మే 3న జరిగిన పరీక్ష రద్దు కాగా.. జూన్ 21న దేశవ్యాప్తంగా రీ-ఎగ్జామ్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన మూల్యాంకన (Evaluation) ప్రక్రియ చివరి దశకు చేరిందని, మరో రెండు వారాల్లో అంటే జూలై 20 లోపు ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నట్లు ఎన్‌టీఏ స్పష్టం చేసింది.

Read Also:NEET JEE Exam Changes: NEET, JEE అడ్మిషన్లలో బోర్డు పరీక్షల మార్కులకు 50% వెయిటేజీ?

10 వేల అభ్యంతరాలు.. త్వరలోనే ఫైనల్ కీ

జూన్ 21న జరిగిన రీ-ఎగ్జామ్‌కు సంబంధించి జూన్ 25న ఎన్‌టీఏ ప్రాథమిక కీ (Provisional Answer Key)ని విడుదల చేసింది. ఈ ఆన్సర్ కీపై దేశవ్యాప్తంగా అభ్యర్థుల నుంచి దాదాపు 10,000 అభ్యంతరాలు (Objections) అందాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం నిపుణుల కమిటీ ప్రతి సవాలును క్షుణ్ణంగా పరిశీలిస్తోందని, సరైన ఆధారాలతో అభ్యంతరం నమోదు చేసిన అభ్యర్థులకు వారు చెల్లించిన కీ అబ్జెక్షన్ ఫీజును పూర్తిగా రిఫండ్ (Refund) చేస్తామని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే ‘ఫైనల్ ఆన్సర్ కీ’తో పాటు తుది ఫలితాలను ప్రకటిస్తారు.

NEET UG 2026 Results: విద్యా సంవత్సరంలో ఆలస్యం లేదు.. ఎన్‌టీఏ క్లారిటీ

రీ-ఎగ్జామ్ వల్ల ఈ ఏడాది ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) విద్యా సంవత్సరం 2026-27 ప్రారంభం కావడంలో ఎటువంటి ఆలస్యం ఉండబోదని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. కౌన్సెలింగ్ ప్రక్రియను రికార్డు సమయంలో పూర్తి చేసి, ఎప్పటిలాగే సాధారణ షెడ్యూల్ ప్రకారమే వైద్య తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు భరోసా ఇచ్చారు.

Epaper: epaper.vaartha.com

తెలంగాణలో వరుసగా 3 రోజులు స్కూల్ హాలిడేస్?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha