Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నియోజకవర్గంలో వివిధ రోడ్ల నిర్మాణానికి రూ. 23.53 కోట్లు: ఆర్థిక శాఖ మంత్రి

నియోజకవర్గంలో వివిధ రోడ్ల నిర్మాణానికి రూ. 23.53 కోట్లు: ఆర్థిక శాఖ మంత్రి

వార్త 1 month ago

Uravakonda: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వివిధ రోడ్ల నిర్మాణం, అభివృద్ధికి 23.53 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.

సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామీణ రోడ్ల బలోపేతానికి సంబంధించిన ప్రాజెక్టు ( ఏపీఆర్ఆర్ఎస్పీ ) కింద ఈ నిధులు మంజూరయ్యాయన్నారు. గోళ్ల బెలుగుప్ప నుండి విరుపాపల్లి వరకు 5.160 కిలోమీటర్ల రోడ్డుకు 3.50 కోట్ల రూపాయలు, ఉదిరిపికొండ నుండి మరుట్ల-2వ కాలనీకు 7.480 కిలోమీటర్ల రోడ్డుకు 3.23 కోట్ల రూపాయలు, ఆత్మకూరు కూడేరు వయా కరుట్లపల్లికు 8.700 కిలో మీటర్ల రోడ్డుకు 2.30 కోట్ల రూపాయలు,

Read Also:Amaravati Capital Gazette: ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు.. కేంద్రం అధికారిక గెజిట్ విడుదల

 Payyavula Keshav

Uravakonda: ఏయే రోడ్లకు ఎంతెంత నిధులు? (వివరాలు)

ఉరవకొండ నుండి హొన్నూరు వయా రాయంపల్లి, నెరమెట్ల నుండి ఉరవకొండకు 13.260 కిలోమీటర్ల రోడ్డుకు 4.91 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయన్నారు. గుంతకల్లు-ఉరవకొండ ఆర్ అండ్ బి రోడ్డు నుండి పాత కడమలకుంటకు 2.142 కిలోమీటర్ల రోడ్డుకు 1.25 కోట్ల రూపాయలు, వజ్రకరూరు నుండి ఉరవకొండ వయా గంజికుంట, తట్రకల్లు, జె.రాంపురంకు 20.526 కిలోమీటర్ల రోడ్డుకు 3.84 కోట్ల రూపాయలు, ఉరవకొండ గుంతకల్లు రోడ్డు నుండి పిసిపి తండాకు 4.210 కిలోమీటర్ల రోడ్డుకు 2.00 కోట్ల రూపాయలు, పాల్తూరు నుండి కరకముక్కలకు 3.540 కిలోమీటర్ల రోడ్డుకు 2.00 కోట్ల రూపాయలు, అనంతపురం- బళ్లారి రోడ్డు నుండి కొట్టాలపల్లికు 1.500 కిలోమీటర్ల రోడ్డుకు 0.50 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha