Dailyhunt
నోరా ఫతేహికి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ నోటీసులు!

నోరా ఫతేహికి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ నోటీసులు!

వార్త 3 weeks ago

KD The Devil Song Controversy: బాలీవుడ్ స్టార్స్ నోరా ఫతేహి మరియు సంజయ్ దత్ నటించిన 'కేడీ: ది డెవిల్' (KD: The Devil) చిత్రం చుట్టూ వివాదం ముదురుతోంది.

ఈ చిత్రంలోని ‘సర్కే చునార్ తేరీ సర్కే’ అనే పాటలో అశ్లీలత మరియు అసభ్యత ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ (NCW) తీవ్రంగా స్పందించింది.

Read Also:Pema Khandu Corruption : రూ.1,270 కోట్ల కాంట్రాక్టులపై CBI దర్యాప్తు

 National Commission for Women notices to Nora Fatehi!

KD The Devil Song Controversy: పోక్సో చట్టాల ఉల్లంఘన?

ఈ పాట భారతీయ న్యాయ సంహిత మరియు పోక్సో (POCSO) చట్టాలను ఉల్లంఘిస్తోందని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. ఏప్రిల్ 6న జరిగిన ప్రాథమిక విచారణకు నోరా ఫతేహి తరపు న్యాయవాది హాజరయ్యారు. అయితే, ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఏప్రిల్ 27 లోపు నోరా ఫతేహి వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు, ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ నటుడు సంజయ్ దత్ ఏప్రిల్ 8న విచారణకు హాజరుకావాల్సి ఉంది.

క్షమాపణలు చెప్పిన చిత్రయూనిట్

వివాదం పెద్దది కావడంతో ‘కేడీ: ది డెవిల్’ చిత్ర బృందం ఇప్పటికే స్పందించింది. ఈ పాట వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరుతూ ఇప్పటికే అధికారికంగా క్షమాపణలు తెలియజేసింది. వివాదాస్పదమైన సదరు పాటను యూట్యూబ్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తొలగించినట్లు చిత్రయూనిట్ వెల్లడించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

మిస్ ఇండియా ఎర్త్ 2019 సయాలీ సుర్వే కిడ్నాప్?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha