Dailyhunt
రూ.1,270 కోట్ల కాంట్రాక్టులపై CBI దర్యాప్తు

రూ.1,270 కోట్ల కాంట్రాక్టులపై CBI దర్యాప్తు

వార్త 3 weeks ago

సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Pema Khandu Corruption : అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖాండూ చుట్టూ అవినీతి ఆరోపణలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. తన కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలకు భారీగా ప్రభుత్వ కాంట్రాక్టులు కట్టబెట్టారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఈ వ్యవహారంపై తక్షణమే ప్రాథమిక విచారణ చేపట్టాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)ను ఆదేశించింది.

వేల కోట్ల కాంట్రాక్టుల ఆరోపణలు

పిటిషనర్ల ఆరోపణల ప్రకారం, సీఎం కుటుంబ సభ్యులు మరియు బంధువులకు చెందిన కంపెనీలకు సుమారు రూ.1,270 కోట్ల విలువైన 91కి పైగా ప్రభుత్వ పనులను అప్పగించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆయన భార్యకు చెందిన 'బ్రాండ్ ఈగల్స్' అనే సంస్థకు పెద్ద సంఖ్యలో కాంట్రాక్టులు దక్కినట్లు వాదించారు.

Read Also:Anupama Parameswaran: త్వరలో పెళ్లి పీటలెక్కనున్న నటి అనుపమ?

 Pema Khandu Corruption

16 వారాల్లో నివేదిక

2015 నుంచి 2025 మధ్య జరిగిన కాంట్రాక్టుల కేటాయింపును సీబీఐ పూర్తిగా పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. పనులు ఎవరికి కేటాయించారు, నిధుల చెల్లింపులు ఎలా జరిగాయి అనే అంశాలపై 16 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది. ఈ దర్యాప్తు అరుణాచల్ రాజకీయాల్లో పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

హిందీ సరిగ్గా రాకపోయినా అమితాబ్‌ను మెప్పించిన సుదీప్.. ఆ సీక్రెట్ ఏంటంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha