Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
"నువ్వో అద్భుత శక్తి" అంటూ త్రిషకు బర్త్‌డే విషెస్ తెలిపిన సమంత

"నువ్వో అద్భుత శక్తి" అంటూ త్రిషకు బర్త్‌డే విషెస్ తెలిపిన సమంత

వార్త 2 weeks ago

Trisha Birthday: త్రిష తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయాన్నే విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తన కెరీర్ లో ఎన్నో విజయాలు అందుకున్న త్రిష, ఆధ్యాత్మిక చింతనతో ఈ ఏడాదినీ ప్రారంభించడం విశేషం. సోషల్ మీడియా వేదికగా ఆమెకు అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Trisha Birthday: సమంత స్పెషల్ విషెస్

‘నువ్వు ఒక అద్భుత శక్తి త్రిష పుట్టినరోజు సందర్భంగా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. “హ్యాపీ బర్త్‌డే త్రిష. నువ్వు ఎదుగుతున్న తీరు, ప్రతికూలతలను తట్టుకుని నిలబడుతున్న విధానం అద్భుతం. నువ్వు ఒక అద్భుత శక్తిగా నిలుస్తున్నావు” అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.

Read Also : Tamil Nadu Election Results: విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపిన టాలీవుడ్ ప్రముఖులు

 Samantha wishes Trisha on her birthday

త్రిష ఫస్ట్ లుక్ అవుట్

మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష నటిస్తున్న భారీ సామాజిక ఫాంటసీ చిత్రం విశ్వంభర’ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో త్రిష పోషిస్తున్న ‘అవని’ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. “అందమైన త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ చిత్రంలో అవని పాత్ర ఎంతో ఆకర్షణీయంగా, ప్రకాశవంతంగా ఉంటుంది” అని యూవీ క్రియేషన్స్ పేర్కొంది. పోస్టర్‌లో త్రిష లుక్ క్లాసీగా, పవర్‌ఫుల్‌గా ఉండటంతో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

కొత్త బంధాలను వెతుక్కోవడంలో తప్పులేదు: తమన్నా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha