Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒడిశా తీరాన్ని దాటిన వాయుగుండం.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు

ఒడిశా తీరాన్ని దాటిన వాయుగుండం.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు

వార్త 2 weeks ago

AP Rain Alert: తీర ప్రాంత ప్రజలను వణికించిన వాయుగుండం ఎట్టకేలకు ఒడిశా సమీపంలో తీరాన్ని దాటింది. గడిచిన 6 గంటల కాలంలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించిన ఈ వాయుగుండం, ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో తీరాన్ని తాకినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) అధికారికంగా ప్రకటించింది.

read also:Chandrababu Naidu: సీఎం చంద్రబాబు కుప్పం టూర్ సక్సెస్..పెట్టుబడులు, సమస్యకు శాశ్వత పరిష్కారం

రాబోయే 24 గంటల ముప్పు:

ఇది మరింత ముందుకు కదులుతూ రానున్న 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించి.. ఉత్తర ఒడిశా, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల మీదుగా సాగిపోయే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

AP Rain Alert: ఏపీలో వర్ష సూచన:

ఈ వాయుగుండం ప్రభావం పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌పై కూడా ఉండనుంది. దీని కారణంగా సోమవారం నాడు రాష్ట్రంలోని విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు (ASR) మరియు పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వర్షాల నేపథ్యంలో సదరు జిల్లాల ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

జనసేనలోకి ఇద్దరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha