Us midterm elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో (US Midterm Elections) రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, భారత సంతతి నేత వివేక్ రామస్వామికి ఊహించని షాక్ తగిలింది.
ఓహియో రాష్ట్ర గవర్నర్ పదవికి పోటీ చేసిన ఆయన, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి అమీ యాక్టన్ చేతిలో ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు.
India Pakistan Trade: భారత్‌తో వాణిజ్యం బంద్.. పాకిస్థాన్‌కు రూ.3.5 లక్షల కోట్ల నష్టం!
ఈ విజయంతో గత 20 ఏళ్లలో ఓహియో గవర్నర్‌గా ఎన్నికైన తొలి డెమొక్రాట్‌గా, అలాగే ఈ పదవిని అధిరోహించనున్న తొలి మహిళగా అమీ యాక్టన్ చారిత్రాత్మక రికార్డు సృష్టించారు.
వివాదాస్పద ప్రచారం: సొంత పార్టీ నేతల ఆగ్రహం
ఎన్నికల ప్రచారంలో వివేక్ రామస్వామి బృందం అమీ యాక్టన్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుంది. ముఖ్యంగా, ఆమెతో సంబంధాలు తెంచుకున్న తల్లిని ఆధారంగా చేసుకుని ఓ వివాదాస్పద ప్రకటనను (Campaign Ad) రూపొందించారు. బాల్యంలో సవతి తండ్రి ఆమెపై అత్యాచారానికి పాల్పడటంతో, పిల్లల సంరక్షణ బాధ్యతలను (కస్టడీ) తల్లి కోల్పోయిన విషయాన్ని రామస్వామి బృందం హైలైట్ చేసింది.

ఈ యాడ్‌పై ఓహియో రిపబ్లికన్ గవర్నర్ మైక్ డివైన్‌తో పాటు ఇరు పార్టీల నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రచార ప్రకటనను ప్రశంసించడం, ఓహియోకు చెందిన వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ దీనిని సమర్థించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రజా సమస్యలే అస్త్రంగా అమీ యాక్టన్ విజయం
వృత్తిరీత్యా వైద్యురాలైన అమీ యాక్టన్, కోవిడ్-19 విజృంభణ సమయంలో ఓహియో రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్‌గా సేవలందించారు. ఆమె తన ప్రచారంలో వ్యక్తిగత విమర్శల కంటే ప్రజల సమస్యలకే ప్రాధాన్యతనిచ్చారు. ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న సాధారణ పౌరులకు ఉపశమనం కలిగించడం, నాణ్యమైన, మెరుగైన ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తెవడం వంటి ఆంశాలపై దృష్టి పెట్టారు. చిన్నతనంలో తాను ఎదుర్కొన్న కష్టాలను, టెంట్‌లో గడిపిన బాల్య అనుభవాలను గుర్తుచేస్తూ శ్రామిక, మధ్యతరగతి ఓటర్లకు ఆమె మరింత చేరువయ్యారు.
ప్రెసిడెన్షియల్ రేస్ నుంచి ఓహియో గవర్నర్ పోరు వరకు..
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వ రేసులో వివేక్ రామస్వామి, నిక్కీ హేలీతో సహా 8 మంది పోటీ పడిన సంగతి తెలిసిందే. తొలి డిబేట్‌లో తన వాక్చాతుర్యంతో ఆకట్టుకున్న రామస్వామి, ఆ తర్వాత ఆశించిన మద్దతు రాకపోవడంతో ప్రచారం నుంచి తప్పుకొని డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ప్రకటించారు.
ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఎలాన్ మస్క్‌తో కలిసి ‘గవర్నమెంట్ ఆఫ్ ఎఫిషియెన్సీ’ (DOGE) హెడ్‌గా నియమితులయ్యారు. అయితే, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి రాజ్యాంగబద్ధమైన పదవిని చేపట్టాలనే ఉద్దేశంతోనే ఆయన డోజ్ నుంచి తప్పుకుని ఓహియో గవర్నర్ రేసులోకి దిగినట్లు ప్రచారం జరిగింది. కానీ ఈ మధ్యంతర ఎన్నికల్లో ఓటమితో ఆయన ఆశలు అడియాసలయ్యాయి.

