Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓజీ సినిమా చూపిస్తూ మహిళకు బ్రెయిన్‌ సర్జరీ.. కారణం ఇదే!

ఓజీ సినిమా చూపిస్తూ మహిళకు బ్రెయిన్‌ సర్జరీ.. కారణం ఇదే!

వార్త 1 week ago

Awake brain surgery Guntur: గుంటూరు జిల్లాలో వైద్యులు ఒక సంక్లిష్టమైన బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. రోగికి మత్తు ఇవ్వకుండా, ఆమెకు ఇష్టమైన నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన సినిమా చూపిస్తూ మెలకువగా ఉన్నప్పుడే మెదడులోని గడ్డను తొలగించి ప్రాణాలు కాపాడారు.

వైద్య పరిభాషలో ‘అవేక్ క్రేనియోటమీ’ గా పిలిచే ఈ అరుదైన శస్త్రచికిత్స వడ్లమూడిలోని డీవీసీ (DVC) ఆసుపత్రిలో జరిగింది.

ప్రకాశం జిల్లా దర్శికి చెందిన గనిపిశెట్టి కోటేశ్వరమ్మ, తన భర్తతో కలిసి గుంటూరు జిల్లా పొన్నూరులో కిచిడీ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, ఇటీవల ఒక్కసారిగా మూర్ఛ రావడంతో కిందపడిపోయారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే వడ్లమూడిలోని డీవీసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పద్మనాభుని అరుణ్‌కుమార్ ఆమెకు ఎంఆర్‌ఐ (MRI) స్కాన్‌తో పాటు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు.

Read Also : Devansh Pushkar Ghat: దేవాన్ష్ పేరు ఏ ఘాట్‌కు పెట్టొద్దు.. మంత్రి లోకేష్

 Woman undergoes brain surgery while showing OG’s movie.. This is the reason!

Awake brain surgery Guntur: మెదడులో ప్రమాదకరమైన చోట గడ్డ

వైద్య పరీక్షల అనంతరం కోటేశ్వరమ్మ మెదడులో గడ్డ (ట్యూమర్) ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే ఆ గడ్డ మెదడులో అత్యంత కీలకమైన, శరీర కదలికలు, పనితీరును నియంత్రించే సున్నితమైన ప్రాంతానికి చాలా దగ్గరగా ఉందని తేలింది. సాధారణ పద్ధతిలో జనరల్ ఎనస్థీషియా (పూర్తి మత్తు) ఇచ్చి సర్జరీ చేస్తే నాడీ వ్యవస్థ దెబ్బతిని పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు భావించారు. దాంతో ఆమె స్పృహలో ఉండగానే శస్త్రచికిత్స చేసి గడ్డను తొలగించాలని తుది నిర్ణయం తీసుకున్నారు.

‘ఓజీ’ సినిమా చూస్తూ.. వైద్యులతో మాట్లాడుతూ..

ఆపరేషన్ సమయంలో రోగి భయపడకుండా, ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉంచేందుకు వీలుగా వారికి ఇష్టమైన వినోదాన్ని అందించడం ఈ విధానంలో ఒక భాగం. ఇందులో భాగంగానే కోటేశ్వరమ్మను తనకు ఇష్టమైన నటుడు ఎవరని వైద్యులు అడగ్గా, ఆమె ‘పవన్ కళ్యాణ్’ అని చెప్పారు. దీంతో వైద్య బృందం ఆమె కళ్ల ముందు ‘ఓజీ’ (OG) సినిమాను ప్లే చేస్తూ సర్జరీ ప్రారంభించింది. కోటేశ్వరమ్మ సినిమా చూస్తూ, నవ్వుతూ, వైద్యులతో మాట్లాడుతూ వారి సూచనలను పాటించారు. ఈ క్రమంలో డాక్టర్ల బృందం అత్యంత జాగ్రత్తగా, నాడీ వ్యవస్థకు ఎలాంటి హాని కలగకుండా మెదడులోని గడ్డను పూర్తిగా తొలగించింది.

వైద్య బృందానికి ప్రత్యేక అభినందనలు

న్యూరో సర్జన్ డాక్టర్ అరుణ్‌కుమార్, అనస్థీషియా నిపుణుడు డాక్టర్ రాజశేఖర్ నేతృత్వంలోని బృందం ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను అత్యంత విజయవంతంగా పూర్తి చేసింది. ఈ అద్భుత విజయాన్ని అందుకున్న వైద్య బృందాన్ని డీవీసీ ఆసుపత్రి ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుతం కోటేశ్వరమ్మ ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉందని, ఆమె వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు అధికారికంగా వెల్లడించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

చిత్తూరు లో లిక్కర్ వ్యాన్ బోల్తా.. మద్యం సీసాల కోసం ఎగబడ్డ జనం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha