Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి.. ఎన్నికల సంఘానికి కవిత కీలక సూచన

ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి.. ఎన్నికల సంఘానికి కవిత కీలక సూచన

వార్త 5 days ago

TG SIR Process: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియపై TRS కీలక నేత కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న డూప్లికేట్ ఓట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆమె కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ECI) డిమాండ్ చేశారు.

ఈ మేరకు హైదరాబాద్‌లో ఓట్ల అక్రమాలపై ఆమె నిలదీశారు.

ముఖ్యంగా హైదరాబాద్ (HYD) మహా నగరంలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజలకు అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఓట్లు ఉన్నాయని కవిత ఈ సందర్భంగా గుర్తుచేశారు. దేశంలో ఎక్కడైనా సరే ఒక పౌరుడికి కేవలం ఒకే ఒక ఓటు ఉండేలా ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇలాంటి డూప్లికేట్ ఓట్ల వల్ల ఎన్నికల నిష్పాక్షికత దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు.

Read Also: Rythu Bharosa Funds Release:రేపు సాయంత్రం 4 గంటలకు రైతు భరోసా నిధులు విడుదల

 One person should have only one vote: Kavitha’s key suggestion to the Election Commission.

TG SIR Process: నియోజకవర్గాల వారీగా ఓట్ల తొలగింపుపై ఆగ్రహం

రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపు ప్రక్రియ అస్తవ్యస్తంగా సాగుతోందని కవిత మండిపడ్డారు. బోధన్ నియోజకవర్గంలో ఏకంగా 7 వేల ఓట్లను అర్ధరహితంగా తొలగించారని ఆమె ఆరోపించారు. అదే సమయంలో.. కొడంగల్ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 33 వేల డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు తేలినా, అక్కడ కేవలం 808 ఓట్లను మాత్రమే ఎందుకు తొలగించారని ఆమె ఘాటుగా ప్రశ్నించారు. కొడంగల్, బోధన్ నియోజకవర్గాల ఓట్ల తొలగింపులో కనిపిస్తున్న ఈ భారీ వ్యత్యాసాలపై కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఎన్నికల సంఘం ముఖ్యమంత్రికి (సీఎం) అనుకూలంగా వ్యవహరిస్తోందా? అనే బలమైన సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఈ అక్రమాలపై ఈసీ తక్షణమే స్పందించి నిష్పాక్షికంగా వ్యవహరించాలని కవిత డిమాండ్ చేశారు.

Epaper: epaper.vaartha.com

ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ జామ్? ఇకపై ఈ కొత్త రూల్స్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha