కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న 'ప్రజా పాలన'ను దేశానికే ఒక రోల్ మోడల్‌గా అభివర్ణించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తెలంగాణలో అత్యంత అద్భుతంగా అమలు చేస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేరళలోని విపక్షాలకు సవాల్ విసురుతూ, “మేము పథకాలను ఎలా అమలు చేస్తున్నామో తెలుసుకోవాలంటే, నేరుగా తెలంగాణకు వచ్చి అక్కడి సామాన్య ప్రజలను అడగండి.. అప్పుడు మా పాలన ఏంటో మీకే అర్థమవుతుంది” అని నినదించారు.
Read Also: Harish Rao: రైతులు దళారులకు అమ్ముకొని నష్టపోవద్దు
CM Revanth: We provided 67 thousand jobs in a single year.. This is the mark of Congress!
ముఖ్యంగా రైతు సంక్షేమం విషయంలో తమ ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించిందని రేవంత్ రెడ్డి వివరించారు. ఏకకాలంలో రూ.21 వేల కోట్ల మేర రైతు రుణమాఫీ చేసి అన్నదాతలకు అండగా నిలిచామని, అలాగే రైతు భరోసా పథకం కింద రూ.18,000 కోట్లు కేటాయించి, అందులో ఏకంగా రూ.9 వేల కోట్లను కేవలం తొమ్మిది రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో జమ చేశామని గణాంకాలతో సహా వివరించారు.
ఉద్యోగాల కల్పన విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం రికార్డులు తిరగరాస్తోందని రేవంత్ రెడ్డి కేరళ ప్రజలకు వివరించారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా, బాధ్యతలు చేపట్టిన ఒకే ఒక్క ఏడాదిలో ఏకంగా 67,173 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని గర్వంగా ప్రకటించారు. నిరుద్యోగుల కలలను నిజం చేస్తూ, పారదర్శకమైన పాలనను అందిస్తున్నామని తెలిపారు. కేరళలో కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తే, ఇలాంటి సంక్షేమ విప్లవం ఇక్కడి ప్రజల జీవితాల్లో కూడా మార్పు తెస్తుందని ఆయన పిలుపునిచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

