Telangana Praja Palana: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభలు విజయవంతంగా పూర్తయ్యాయి. గ్రామ స్థాయిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొం దించేందుకు నిర్వ హించిన ఈ గ్రామ సభలకు ప్రజలు విశేషంగా స్పందించి ఉత్సా హంగా పాల్గొ న్నారు.
ప్రతీ గ్రామంలో విధిగా గ్రామ సభలు నిర్వ హించారు. మం డలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు, ఎమ్మెల్యెలు, ప్రజా ప్రతినిధులు, సిఎస్ రామకృష్ణారావు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్ దివ్య దేవరాజన్ తోపాటు ఉన్నతాధికారులు పాల్గొని గ్రామస్థులతో ప్రత్యక్షంగా మమేకమయ్యారు.
Read Also: Harish Rao: రైతులు దళారులకు అమ్ముకొని నష్టపోవద్దు
ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పలు గ్రామ సభల్లో పాల్గొని లబ్దిదారుల అభిప్రాయలు తెలుసుకున్నారు. గ్రామ సభల ఉద్దేశాన్ని వివరించారు. పలు గ్రామాల్లో మహిళా భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ప్రజల జీవితాలను స్పష్టమైన మార్పు తీసుకురావడమే ప్రజా ప్రభుత్వ లక్ష ్యమని, స్థానిక చట్టసభలే గ్రామ సభలని, గ్రామ సభతీర్మానం ద్వారానే ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామన్నారు. సమస్యలను పరిష్కరించుకుంటూ గ్రామాలను అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి గ్రామ సభలు దోహదపడతాయని తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో గ్రామంలోని ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలని, ప్రతి మహిళను మహిళా సంఘాలలో చేర్పించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Telangana Public Governance: Gram Sabha or Local Legislative Bodies
గ్రామ సభలు విజయవంతం చేసిన పంచాయతీ రాజ్, జిల్లా అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభలకు సుమారు 15 లక్షల మంది ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వివిధ శాఖలకు చెందిన 75 వేల మంది అధికారులు పాల్గొని లబ్దిదారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. మహిళా సాధికారతకు ప్రతీకగా 3.76 లక్షల మంది మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులు సభల్లో చురుకుగా పాల్గొన్నారు. వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారులు 4.66 లక్షల మంది హాజరై తమ అనుభవాలను పంచుకున్నారు.
మంత్రి సీతక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 12,450 గ్రామ పంచాయతీల్లో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించే వ్యవస్థను బలోపేతం చేశారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఈ గ్రామ సభల్లో గ్రామాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు సమగ్రంగా వివరించారు. లబ్ధిదారుల అభిప్రాయాలను తెలుసుకొని, వారి సమస్యలను నమోదు చేశారు. పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం వంటి పథకాల వల్ల తమకు కలిగిన మేలు గురించి లబ్దిదారులు భావోద్వేగంతో వివరించడం విశేషం.
ఇప్పటికే అమలులో ఉన్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, రాబోయే రోజుల్లో అమలు చేయబోయే పథకాలపై కూడా చర్చించారు. ఇంకా పథకాల లబ్ది పొందని అర్హులైన పేదలు తమ దరఖాస్తులను గ్రామ పంచాయతీ కార్యదర్శి వద్ద సమర్పించాలని అధికారులు తెలిపారు. గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, కొత్త దరఖాస్తుల స్వీకరణలో గ్రామ సభలు కీలక వేదికగా నిలుస్తున్నాయని అధికారులు తెలిపారు. ప్రజల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని మరింత సమర్థవంతమైన పాలన అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

