Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒకే ఈవెంట్‌లో సమంత - నాగచైతన్య.. అది కూడా పార్ట్‌నర్స్‌తో

ఒకే ఈవెంట్‌లో సమంత - నాగచైతన్య.. అది కూడా పార్ట్‌నర్స్‌తో

వార్త 1 month ago

Samantha Naga Chaitanya Same Event: టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ కపుల్‌గా వెలిగిన సమంత, నాగచైతన్యలు విడిపోయిన తర్వాత ఎప్పుడూ కలిసి కనిపించలేదు.

అయితే, తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రన్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో ఈ మాజీ జంట ఒకే ప్రాంగణంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. విడాకుల తర్వాత వీరిద్దరూ ఇలా ఒకే ఈవెంట్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి కావడంతో కెమెరా కళ్లన్నీ వీరిపైనే నిలిచాయి.

Read Also:LIK OTT Release: ప్రదీప్ రంగనాథన్ 'LIK' ఓటీటీ ఎంట్రీ.. మే 6 నుంచి స్ట్రీమింగ్!

Samantha Naga Chaitanya Same Event: తమ కొత్త జీవిత భాగస్వాములతో సందడి

ఈ వేడుకకు నాగచైతన్య తన భార్య శోభితా ధూళిపాళ, తల్లిదండ్రులు నాగార్జున-అమలతో కలిసి విచ్చేశారు. నాగచైతన్య – శోభితల జంట ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సరిగ్గా అదే సమయంలో, సమంత తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి రిసెప్షన్ ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. గతంలో ఎన్నో గాలివార్తలు వచ్చినప్పటికీ, ఈసారి నిజంగానే వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించడంతో చిత్ర పరిశ్రమలో ఇది హాట్ టాపిక్ అయ్యింది.

 Samantha Naga Chaitanya Same Event Wedding Reception

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

చెల్లెలి పుట్టినరోజున రష్మిక ఎమోషనల్ పోస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha