Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒకే రోజులో 25% కుప్పకూలిన షేర్లు, రూ. 6 లక్షల కోట్లు ఆవిరి!

ఒకే రోజులో 25% కుప్పకూలిన షేర్లు, రూ. 6 లక్షల కోట్లు ఆవిరి!

వార్త 3 weeks ago

IBM Share Price Crash: గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం (IBM) సరికొత్త సంక్షోభంలో మునిగిపోయింది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్లు ఒక్క రోజులోనే ఏకంగా 25 శాతం కుప్పకూలడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ఈ భారీ పతనంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో సుమారు రూ. 6 లక్షల కోట్లు (సుమారు 72 బిలియన్ డాలర్లు) క్షణాల్లో తుడిచిపెట్టుకుపోయాయి. ఐబీఎం సుదీర్ఘ 58 ఏళ్ల వ్యాపార చరిత్రలో ఒకే రోజు ఈ స్థాయి ఘోర పతనాన్ని నమోదు చేయడం ఇదే తొలిసారి కావడంతో ఐటీ పరిశ్రమలో కలకలం రేగుతోంది. కంపెనీ ప్రకటించిన రెండవ త్రైమాసిక (Q2) ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలను దారుణంగా నిరాశపరచడమే ఈ పతనానికి ప్రధాన కారణమైంది.

Read Also :Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం, వెండి ధరలు

సంక్షోభానికి దారితీసిన ప్రధాన కారణాలు

జూన్ త్రైమాసికంలో ఐబీఎం మొత్తం ఆదాయం కేవలం 1% వృద్ధితో రూ. 1.48 లక్షల కోట్లకు మాత్రమే పరిమితమైంది. ప్రధానంగా కంపెనీకి పట్టున్న సాంప్రదాయ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (మౌలిక సదుపాయాల) వ్యాపార ఆదాయం 7% మేర పడిపోయింది. సాఫ్ట్‌వేర్ విభాగం 5% పెరిగినా మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేకపోయింది. మారుతున్న సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా తాము వేగంగా మారలేకపోయామని ఐబీఎం గ్లోబల్ సీఈఓ అరవింద్ కృష్ణ ఇన్వెస్టర్లకు రాసిన లేఖలో బహిరంగంగా అంగీకరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక వసతులపై కంపెనీలు భారీగా ఖర్చు చేస్తున్నాయి. సర్వర్లు, మెమరీ చిప్స్, ఏఐ స్టోరేజ్ పరికరాల కొనుగోళ్లకు ప్రాధాన్యత పెరిగింది. ఫలితంగా ఐబీఎంకు అత్యధిక లాభాలు తెచ్చే సాంప్రదాయ 'మెయిన్‌ఫ్రేమ్ కంప్యూటర్లు', వాటి సాఫ్ట్‌వేర్‌పై కంపెనీలు తమ బడ్జెట్‌ను తగ్గించుకున్నాయి.

సైబర్ భద్రత ఆందోళనలు - మారిన సమీకరణాలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా సైబర్ దాడుల ముప్పు పెరుగుతోందన్న ఆందోళన కూడా ఐబీఎం వ్యాపారాన్ని దెబ్బతీసింది. ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ (Anthropic) విడుదల చేసిన 'మిథోస్' (Mythos) ఏఐ మోడల్.. కంప్యూటర్ నెట్‌వర్క్‌లలోని భద్రతా లోపాలను సులభంగా గుర్తిస్తుందన్న వార్తలతో ప్రపంచ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. దీంతో సంస్థలన్నీ కొత్త సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టుల కంటే సైబర్ సెక్యూరిటీపైనే బడ్జెట్‌ను కేటాయించాయి. ఫలితంగా క్రౌడ్‌స్ట్రైక్ (CrowdStrike), ఒక్టా (Okta), నెట్‌స్కోప్ (Netskope) వంటి సైబర్ సెక్యూరిటీ కంపెనీల షేర్లు భారీ లాభాలను ఆర్జించగా, ఐబీఎం నష్టపోవాల్సి వచ్చింది.

IBM Share Price Crash: సంక్షోభంలోనూ ఆశాకిరణాలు & రూ. 43 వేల కోట్ల భారీ ప్లాన్

భారీ నష్టాల మధ్య కూడా ఐబీఎంకు చెందిన 'రెడ్‌హ్యాట్' (RedHat) విభాగం 11 శాతం ఆదాయ వృద్ధిని సాధించింది. అలాగే, మెయిన్‌ఫ్రేమ్‌లకు భిన్నంగా ఉండే సర్వర్, స్టోరేజ్ బిజినెస్ 37 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌లో భద్రతా లోపాలను గుర్తించి, వాటిని తక్షణమే పరిష్కరించే లక్ష్యంతో ఐబీఎం సుమారు రూ. 43,000 కోట్ల ($5 Billion) భారీ వ్యయంతో 'లైట్‌వెల్' (Lightwell) అనే నూతన ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రకటించింది. ఐబీఎం చేపట్టిన ఈ మెగా ప్రాజెక్టుకు అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజాలైన బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీ మోర్గాన్ ఛేజ్, గోల్డ్‌మన్ శాక్స్ పూర్తి మద్దతు ప్రకటిస్తుండటం కంపెనీకి కొంత ఊరటనిచ్చే అంశం.

గూగుల్‌ను వీడిన నలుగురు సీనియర్‌ ఏఐ నిపుణులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha