Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒకేసారి ఐదుకు పైగా మందులు వేసుకుంటున్నారా? అయితే జాగ్రత్త

ఒకేసారి ఐదుకు పైగా మందులు వేసుకుంటున్నారా? అయితే జాగ్రత్త

వార్త 2 weeks ago

Medicines: వయసు పెరిగే కొద్దీ రకరకాల అనారోగ్య సమస్యలు రావడం సాధారణం. కానీ ఆ జబ్బుల కోసం వాడే మందులే ఇప్పుడు కొత్త తలనొప్పులు తెస్తున్నాయి. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారు ఒకేసారి ఐదు నుంచి పది రకాల మందులు వేసుకోవడాన్ని 'పాలీఫార్మసీ' అంటారు.

ఇటీవల జరిగిన పరిశోధనల్లో ఇలా ఎక్కువ మందులు వాడే వారిలో 64 శాతం మందికి డ్రగ్ రియాక్షన్ వచ్చే అవకాశం ఉందని తేలింది. వృద్ధులు సగటున రోజుకు 7 నుంచి 10 రకాల మాత్రలు మింగుతున్నారు. వీటి మధ్య జరిగే రసాయనిక చర్యల వల్ల ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Read also: Ginger Benefits: భోజనానికి ముందు అల్లం ముక్క.. ఆరోగ్యానికి ఎంతో మేలు!

 Side effects of taking many medicines

Medicines: ఈ మందులు కలిపి వాడొద్దు

కొన్ని రకాల మందులను కలిపి వాడటం వల్ల శరీరంలో విషతుల్యమైన మార్పులు వస్తాయి. ఉదాహరణకు గుండె సమస్యల కోసం వాడే ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్ కలిపి వేసుకుంటే అంతర్గత రక్తస్రావం అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఇన్సులిన్ వాడుతూ బీటా-బ్లాకర్స్ తీసుకుంటే, షుగర్ లెవల్స్ పడిపోయినప్పుడు వచ్చే హెచ్చరికలు తెలియవు. దీనివల్ల రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఇన్హిబిటర్లు, పొటాషియం కలిస్తే రక్తంలో పొటాషియం పెరిగి గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కళ్లు తిరగడం, అలసట, జీర్ణక్రియ సమస్యలు కూడా తలెత్తుతాయి.

అప్రమత్తంగా ఉండండి

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల వల్ల ముడి పదార్థాల కొరత ఏర్పడి మందుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది రోగులపై ఆర్థిక భారంగా మారుతోంది. ఒక మందు వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్‌ను కొత్త వ్యాధిగా భావించి, మరిన్ని కొత్త మందులు వాడటం వల్ల ఆరోగ్యం పాడవ్వడమే కాకుండా డబ్బు కూడా వృథా అవుతుంది. కొత్తగా డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా పాత ప్రిస్క్రిప్షన్లను చూపించాలి. అవసరం లేని మందులను తగ్గించుకోవడం వల్ల అటు ఆరోగ్యం, ఇటు జేబు రెండూ సురక్షితంగా ఉంటాయి.

మందుల దుష్ప్రభావాలను గుర్తించండి ఇలా

  • శరీర సమతుల్యత దెబ్బతిని అకస్మాత్తుగా కిందపడిపోవడం.
  • ఎప్పుడూ లేని విధంగా విపరీతమైన నీరసం రావడం.
  • కడుపులో మంట, వికారం వంటి జీర్ణకోశ ఇబ్బందులు.
  • మందులు వేసుకున్నాక చర్మంపై దద్దుర్లు రావడం.
  • జ్ఞాపకశక్తి తగ్గడం లేదా గందరగోళంగా అనిపించడం.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha