Suyodhana OTT: కమెడియన్ నుండి హీరోగా మారి వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి నటించిన తాజా చిత్రం 'సుయోధన' (Suyodhana). బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఈ మిస్టరీ థ్రిల్లర్, ఇప్పుడు అనూహ్యంగా రెండు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
Read Also:Papam Pratap Review: 'పాపం ప్రతాప్' మూవీ రివ్యూ
ఈ సినిమాను వైఎస్ మాధవరెడ్డి తెరకెక్కించాడు. టీజర్, ట్రైలర్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా మార్చి 27న థియేటర్లలోకి వచ్చింది. అయితే, విడుదలై నెల గడుస్తున్నా సందర్బంగా తాజాగా ఈ సినిమా ఓటీటీలో కి వచ్చేసింది ఈ మూవీ. అయితే ఒకటి కాదు రెండు ఓటీటీలో ఈ సినిమా ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి, థియేటర్స్ లో ఆశించిన ఫలితం దక్కించుకొని ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.
Suyodhana OTT: స్టోరీ ఏంటంటే?
వరుణ్ (ప్రియదర్శి) ఓ ఫోలీ (సినిమాలకు సౌండ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేసే ఆర్టిస్ట్)గా వర్క్ చేస్తుంటాడు. అతనికి చిన్నప్పటి నుంచీ సుయోధన అనే మిస్టీరియస్ సౌండ్ వినిపిస్తుంటుంది. అప్పుడే కళ్ల ముందు దుర్యోధనుడి రూపం కనిపిస్తుంటుంది. దీంతో వరుణ్ ఆందోళన చెందుతుంటాడు. అతని తండ్రి ప్రకాష్ (సాయి కుమార్) రంగ స్థల నటుడు. ఆయనకు దుర్యోధనుడి పాత్రలు వేయడమంటే చాలా ఇష్టం. అయితే, ఆ రూపంలో తనను చూసిన కొడుకు భయపడుతున్నాడని డాక్టర్స్ చెప్పడంతో నాటకాలకు స్వస్తి పలుకుతాడు.
Suyodhana Streamingఆ తర్వాత పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యే రేసులో ఉంటాడు. ఈ గ్యాప్‌లో ఓ డెమో ఫిల్మ్ షూట్ కోసం వచ్చిన సమిత (ద్రిషిక చందర్) వరుణ్‌కు పరిచయం అవుతుంది. ఆమె షూట్ చేసిన క్యారెక్టర్‌లోనూ వరుణ్‌కు దుర్యోధనుడే కనిపిస్తాడు. తన ప్రమాదం పొంచి ఉన్నప్పుడే ఈ రూపం కనిపిస్తుందని తెలుసుకుంటాడు వరుణ్. సరిగ్గా అదే టైంలో తండ్రిలోనే అతనికి దుర్యోధనుడు కనిపించగా… ఆ తర్వాత జరిగిన దాడిలో తండ్రి చనిపోతాడు. అసలు వరుణ్ తండ్రిని చంపింది ఎవరు? ఈ మర్డర్ వెనుక పొలిటికల్ స్కెచ్ ఏమైనా ఉందా? వరుణ్‌ను వెంటాడుతున్న సుయోధన రూపం మిస్టరీ ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
నెల తిరక్కుండానే ఓటీటీలోకి 'బ్యాండ్ మేళం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

