Death Whisperer 3 Movie: 'ది కంజురింగ్', 'ఇన్సిడియస్' వంటి మైండ్ బ్లాకింగ్ హారర్ చిత్రాల స్థాయికి ఏమాత్రం తీసిపోకుండా, గుండెల్లో రైళ్లు పరిగెత్తించే క్రైమ్ అండ్ హారర్ థ్రిల్లర్ థాయ్‌లాండ్ బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీ మూవీ 'డెత్ విస్పరర్ 3'.
ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతోంది. ఈ సినిమాను మిగతా హారర్ చిత్రాల కంటే ప్రత్యేకంగా నిలిపేది ఇందులో ఉన్న ‘రియాలిటీ’. ఈ ఫ్రాంచైజీలోని మొదటి రెండు భాగాలు ప్రసిద్ధ నవలల ఆధారంగా తెరకెక్కగా, ఈ మూడో భాగాన్ని మాత్రం 1972లో చోటుచేసుకున్న ఓ రహస్యమైన, యథార్థ సంఘటన ఆధారంగా మలిచారు. 2 గంటల 8 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం ప్రేక్షకుడికి క్షణం కూడా పక్కకు తప్పుకోనివ్వని భయాందోళనను, సస్పెన్స్‌ను అందిస్తుంది. కథానాయకుడు ‘యాక్’, అతని ప్రాణానికి ప్రాణమైన సోదరి ఎంతో సంతోషంగా జీవిస్తున్న సమయంలో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంటుంది. ఆమె దారుణమైన అపహరణకు గురవుతుంది. తన చెల్లెలిని ఎలాగైనా కాపాడుకోవాలనే పట్టుదలతో యాక్ ఓ భయంకరమైన అన్వేషణను ప్రారంభిస్తాడు.
Read Also : Uyir Movie: ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ 'ఉయిర్'
‘Death Whisperer 3’ is taking OTT by storm.
Death Whisperer 3 Movie: దుష్టశక్తుల గ్రామంలో చెల్లెలి కోసం అన్వేషణ
ఆ ప్రయాణంలో అతడు, దశాబ్దాలుగా దుష్టశక్తుల శాపానికి గురైన ఒక భయానక గ్రామానికి చేరుకుంటాడు. అక్కడ కన్నులారా చూసే దృశ్యాలు, ఎదురయ్యే వికృతమైన ఆత్మలు, రాక్షస శక్తులతో అతడు చేసే పోరాటం ఒళ్ళు గగుర్పొడుస్తుంది. యాక్ తన సోదరిని ప్రాణాలతో కాపాడుకోగలిగాడా? ఆ గ్రామం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం.
భయపెట్టే సౌండ్ ఎఫెక్ట్స్.. నటీనటుల అద్భుత నటన
కథానాయకుడిగా నడెక్ కుకిమియా తన నటనతో అదరగొట్టాడు. చెల్లెలిపై ప్రేమ, దుష్టశక్తులపై నరనరాన పొంగే ఆవేశం, భయం కలగలిపిన పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు అద్భుతం. సోదరి పాత్రలో నాచా జెస్సికా అలరించారు. ఇక ఈ సినిమాకు అసలైన గుండెకాయ ‘బ్యాక్‌గ్రౌండ్ స్కోర్’. ఒళ్ళు గగుర్పొడిచే సౌండ్ డిజైన్, గుండెలు ఆగిపోయేలా వచ్చే జంప్-స్కేర్ సన్నివేశాలు హారర్ ప్రేమికులను పిచ్చెక్కిస్తాయి. మీరు కనుక మైండ్-బెండింగ్ సస్పెన్స్, ఒరిజినల్ హారర్ అనుభూతిని కోరుకునేవారైతే, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ ‘డెత్ విస్పరర్ 3’ని అస్సలు మిస్ కావద్దు. ఒక్కసారి చూడటం స్టార్ట్ చేస్తే పూర్తి చేసేదాకా లైట్లు కూడా ఆర్పలేరు!

