Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓటీటీలోకి తిరువీర్ 'పాపం ప్రతాప్' ఎప్పటి నుంచంటే?

ఓటీటీలోకి తిరువీర్ 'పాపం ప్రతాప్' ఎప్పటి నుంచంటే?

వార్త 2 weeks ago

Papam Pratap Movie: విభిన్నమైన కథాంశాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు తిరువీర్. ఆయన రీసెంట్‌గా నటించిన విలేజ్ ఎమోషనల్ డ్రామా 'పాపం ప్రతాప్' ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీపై అధికారిక స్పష్టత వచ్చేసింది.

దర్శకుడు ఎస్.సి. దుర్గా నగేష్ తెరకెక్కించిన ఈ చిత్రం స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణంలో సాగుతుంది. తిరువీర్ తన నటనతో మరోసారి ఆకట్టుకోగా, ఆయనకు జంటగా పాయల్ రాధాకృష్ణ నటించారు. వీరిద్దరి మధ్య పండించిన కెమిస్ట్రీ, భావోద్వేగపూరిత సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. మిత్రవింద సినిమాస్ నిర్మించిన ఈ చిత్రానికి కె.ఎమ్. రాధాకృష్ణన్ అందించిన సంగీతం కథలోని ఫీల్‌ను అద్భుతంగా ఎలివేట్ చేసింది.

Read Also : Kerala Road Accident: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి

 ETV Win is ready for streaming Papam Pratap Movie

ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలైన 'పాపం ప్రతాప్', కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, చూసిన ప్రతి ఒక్కరినీ కదిలించింది. థియేటర్లలో ఈ హార్ట్ టచింగ్ స్టోరీని మిస్ అయిన వారి కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ 'ఈటీవీ విన్' ETV Win ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా మే 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

గ్రామీణ నేపథ్యంలో సాగే సామాన్యుడి కథలను, సహజమైన నటనను ఇష్టపడే వారికి 'పాపం ప్రతాప్' ఒక మంచి ఆప్షన్. ముఖ్యంగా తిరువీర్ నటనలోని సహజత్వం ఓటీటీ ఆడియన్స్‌ను కచ్చితంగా మెప్పిస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. మరి హృదయాన్ని హత్తుకునే ఈ ఎమోషనల్ డ్రామాను మే 7 నుంచి మీ ఈటీవీ విన్ యాప్‌లో వీక్షించవచ్చు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

"నువ్వో అద్భుత శక్తి" అంటూ త్రిషకు బర్త్‌డే విషెస్ తెలిపిన సమంత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha