Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాకిస్థాన్, ఖతార్ ఉగ్ర నైజాన్ని ఎండగట్టిన అమెరికా సెనేటర్లు

పాకిస్థాన్, ఖతార్ ఉగ్ర నైజాన్ని ఎండగట్టిన అమెరికా సెనేటర్లు

వార్త 1 week ago

US Senators Slams Pak : ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చల్లో మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్, ఖతార్‌లపై అమెరికా రిపబ్లికన్ సెనేటర్లు రిక్ స్కాట్, టిమ్ షీహీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ రెండు దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వడంతో పాటు నిధులు సమకూర్చాయని వారు ఘాటుగా విమర్శించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాక్ ఆర్మీ చీఫ్‌పై ప్రశంసలు కురిపించిన కొన్ని గంటల్లోనే సొంత పార్టీ సెనేటర్లు ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

‘మన నిజమైన మిత్రులు ఎవరో తెలుసుకోవాలి’ – సెనేటర్ రిక్ స్కాట్

ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ రిక్ స్కాట్ సోషల్ మీడియా వేదికగా పాకిస్థాన్, ఖతార్‌లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికాకు నిజమైన మిత్రులు ఎవరో గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్, ఖతార్‌లకు ఉగ్రవాదాన్ని పోషించిన నల్లని చరిత్ర ఉందని గుర్తు చేశారు. ఈ దేశాలు శాంతి స్థాపన కంటే, ఇరాన్ సాగిస్తున్న ఉగ్రవాద చర్యలకు మద్దతు ఇవ్వడానికే మొగ్గు చూపుతున్నాయని ఆరోపించారు.అయితే, ఇరాన్‌తో ఒప్పందాలు జరిగినప్పటికీ, ఆ దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు.

Read Also: UK PM : జులై లో యూకే కు కొత్త ప్రధాని ప్రమాణ స్వీకారం

 US Senators Slams Pak

US Senators Slams Pak : ‘బిన్ లాడెన్‌ను దశాబ్దం పాటు దాచారు’ – సెనేటర్ టిమ్ షీహీ

మొంటానా సెనేటర్ టిమ్ షీహీ ‘ఫాక్స్ న్యూస్’ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అల్ ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ అంశాన్ని ప్రస్తావించారు.పాకిస్థాన్ దాదాపు పదేళ్ల పాటు బిన్ లాడెన్‌కు రక్షణ కల్పించిందని, ఐఎస్ఐ (ISI) ద్వారా ఇరాన్ మత గురువులకు మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. ఇరాన్ చర్చల్లో ఇలాంటి దేశాలను భాగస్వామ్యం చేయడం కంటే, అమెరికా సంప్రదాయ మిత్రదేశాలైన యూఏఈ, ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలను చేర్చాలని డిమాండ్ చేశారు. పశ్చిమాసియాలో అమెరికాకు నిజమైన మిత్రులు వీరేనని, ఉగ్రవాదానికి ఆర్థిక సాయం చేసే ఖతార్, పాక్‌లను తటస్థ మధ్యవర్తులుగా భావించలేమని తేల్చి చెప్పారు.

జేడీ వాన్స్ వ్యాఖ్యలు – అమెరికా రాజకీయాల్లో చర్చ

స్విట్జర్లాండ్‌లో జరిగిన చర్చల సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్థాన్‌పై సానుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. “నా జీవితంలో ఇద్దరు చాలా ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. ఒకరు నా భార్య (భారతీయురాలు), మరొకరు పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసీం మునీర్.” అని వాన్స్ సరదాగా వ్యాఖ్యానించారు. గత మూడు నెలల్లో తాను మునీర్‌తో అనేకసార్లు మాట్లాడానని వాన్స్ చెప్పిన కొద్దిసేపటికే, రిపబ్లికన్ సెనేటర్లు పాక్‌ను ఉగ్రవాద దేశంగా అభివర్ణించడం అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. 2011లో అబ్బొట్టాబాద్‌లో అమెరికా దళాలు బిన్ లాడెన్‌ను హతమార్చినప్పటి నుండి పాక్‌పై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ, ప్రస్తుత అమెరికా-ఇరాన్ చర్చలకు ఖతార్, పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించాయి. ఈ చర్చల ద్వారా క్రింది నిర్ణయాలు తీసుకున్నారు.

ఏనుగు పేడతో కాఫీ.. ఖరీదు ఎంతో తెలుసా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha