Pakistan Earthquake: పాకిస్థాన్ లో శనివారం (జూన్ 27) ఒక మోస్తరు భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.4గా నమోదైనట్లు యూరోపియన్-మెడిటేరియన్ సీస్మలాజికల్ సెంటర్ (EMSC) అధికారికంగా వెల్లడించింది.
ఒక్కసారిగా భూమి కంపించడంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి ప్రాణాలు చేతిలో పట్టుకుని వీధుల్లోకి పరుగులు తీశారు.
Read Also:Gautam Adani: అదానీపై ఉన్న లంచం కేసును కొట్టివేయడానికి అమెరికా కోర్టు నిరాకరణ
Pakistan Earthquake: 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం
యూరోపియన్-మెడిటేరియన్ సీస్మలాజికల్ సెంటర్ అందించిన ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఈ భూకంప కేంద్రం భూమి అంతర్భాగంలో 35 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంపం సంభవించిన వెంటనే స్థానిక విపత్తు నిర్వహణ సంస్థలు రంగంలోకి దిగాయి. భూప్రకంపనల తీవ్రతకు కొన్ని భవనాలు స్వల్పంగా ఊగినప్పటికీ.. ఈ ఘటనకు సంబంధించిన ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. సరిహద్దు మరియు ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు.
Pakistan earthquake today live updates

