Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాలమూరు తలరాత మార్చింది కేసీఆర్ - హరీశ్

పాలమూరు తలరాత మార్చింది కేసీఆర్ - హరీశ్

వార్త 2 months ago

Palamur : తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రాజెక్టులు, అభివృద్ధిపై రాజకీయ సవాల్ ప్రతిసవాళ్లు తీవ్రస్థాయికి చేరాయి.

తాను పాలమూరు బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తన రెండున్నరేళ్ల పాలనలో ఉమ్మడి మహబూబ్‌నగర్ (పాలమూరు) జిల్లాకు చేసింది ‘గుండు సున్నా’ అని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల హయాంలో పాలమూరు జిల్లా కేవలం వలసలకు, ఆకలి చావులకు, తీవ్ర కరువుకు నిలయంగా మారిందని ఆయన గుర్తు చేశారు. అలాంటి వెనుకబడిన ప్రాంతాన్ని అపర భగీరథుడిలా కేసీఆర్ తన పదేళ్ల పాలనలో ఎండబెట్టిన బీడు భూములకు సాగునీరు అందించి, పచ్చని పంటలతో పాలమూరు తలరాతను పూర్తిగా మార్చివేసారని హరీశ్ రావు స్పష్టం చేశారు.

Read Also : ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలి

ప్రాజెక్టులపై కాంగ్రెస్ కుట్రలు

పాలమూరు ప్రాంతానికి గుండెకాయ లాంటి ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా గతంలో కోర్టుల్లో కేసులు వేయించి, ఆ ప్రాజెక్టును అడ్డుకోవడానికి కుట్రలు చేసింది కాంగ్రెస్ నాయకులేనని హరీశ్ రావు ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు ఎంత మంది రైతులను కాంగ్రెస్ నేతలు రెచ్చగొట్టినా, వ్యూహాత్మకంగా వ్యవహరించి దాదాపు 27 వేల ఎకరాల భూమిని సేకరించి ప్రాజెక్టును పరుగులు పెట్టించిందని ఆయన వెల్లడించారు. తాము నిర్మించిన ప్రాజెక్టులు, తీసుకొచ్చిన అభివృద్ధి కళ్లముందే కనిపిస్తుంటే, తానేదో పొడిచేశానని సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. పాలమూరు సంక్షేమంపై రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే బురదజల్లే రాజకీయాలు మానుకోవాలని హరీశ్ రావు హితవు పలికారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

గండిపేట ప్రభుత్వ భూముల కబ్జా కేసు: వైకాపా మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha