విద్యార్థుల్లో పోటీతత్వం, స్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యం
10th Class Merit Students Awards: గ్రామీణ ప్రాంతాల్లో విద్యాపట్ల ఆసక్తి పెంపొందించి, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా ఉన్నత విద్యాభ్యాసానికి దారితీసే లక్ష్యంతో పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక అభినందన సభ నిర్వహిస్తున్నట్లు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దె నాయక్ తెలిపారు.
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను గుర్తించి అవార్డులు, జ్ఞాపికలు, ప్రోత్సాహకాలను అందించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం ఈ నెల 16వ తేదీన కళ్యాణదుర్గంలోని శ్రీ వాసవి కళ్యాణమంటపంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరుకానుండగా, విద్యాశాఖ అధికారుల సహకారంతో ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.విద్యార్థుల్లో పోటీతత్వ భావన పెంపొందించడంతో పాటు, పేద మరియు గ్రామీణ కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులకు ప్రేరణ కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ట్రస్ట్ ప్రతినిధులు వివరించారు. విద్య ద్వారా సామాజిక మార్పు సాధ్యమవుతుందని, ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు.
Read Also : NEET-UG 2026: నీట్ పరీక్ష రద్దుపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?
Awards ceremony for students at Kalyanadurgam
10th Class Merit Students Awards: మండలాల వారీగా ప్రతిభావంతుల వివరాలు
కళ్యాణదుర్గం మండలం
- ప్రథమ స్థానం: టీ. అభిజ్ఞ - 583/600
- ద్వితీయ స్థానం: పి. రహమాన్ ఖాన్ - 571/600
- తృతీయ స్థానం: జి. అమృత - 571/600
శెట్టూరు మండలం
- ప్రథమ స్థానం: ఇ. లతీఫ్ - 581/600
- ద్వితీయ స్థానం: జి. నిశాంత్ - 578/600
- తృతీయ స్థానం: జె. ప్రసాద్ - 572/600
కుందుర్పి మండలం
- ప్రథమ స్థానం: ఎ. సందీప్ రెడ్డి - 582/600
- ద్వితీయ స్థానం: యశస్విని - 581/600
- తృతీయ స్థానం: ఎస్. దేవరాజు - 572/600
బ్రహ్మసముద్రం మండలం
- ప్రథమ స్థానం: సి. శశాంక్ - 581/600
- ద్వితీయ స్థానం: పి. అహల్య - 578/600
- తృతీయ స్థానం: సి. జానకి - 576/600
కంబదూరు మండలం
- తృతీయ స్థానం: కె. ప్రణయ్ - 572/600
- ప్రథమ స్థానం: సి. విశ్వేశ్వర రెడ్డి - 587/600
- ద్వితీయ స్థానం: జి. సాయి దివ్య - 578/600
ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ, విద్యార్థుల విజయం వారి కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం కలయికేనని పేర్కొన్నారు. "చదువే భవిష్యత్తుకు బలమైన పునాది" అనే సందేశంతో విద్యార్థులు మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

