Alu Coconut Fry:ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించే రుచైన కొబ్బరి ఆలూ ఫ్రై తయారీ విధానం చాలా సింపుల్! అన్నం, పప్పుచారు, సాంబార్, రసంతో నంచుకోవడానికి లేదా చపాతీల్లోకి ఇది అద్భుతమైన కాంబినేషన్.
Jowar Breakfast Recipe: జొన్నలతో సింపుల్ అండ్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్
Coconut potato fry in ten minutes
కావలసిన పదార్థాలు:
- బంగాళాదుంపలు: 4
- ధనియాలు: 1 టీస్పూన్
- శనగపప్పు: 2 టీస్పూన్లు
- ఎండుమిర్చి: 6
- ఎండుకొబ్బరి: 1 చిప్ప
- మిరియాలు: ½ టీస్పూన్
- నువ్వులు: 1 టీస్పూన్
- జీలకర్ర: ½ టీస్పూన్
- పసుపు: ½ టీస్పూన్
- నిమ్మరసం: 1 టీస్పూన్
- నూనె: 4 టేబుల్ స్పూన్లు
- కరివేపాకు: తగినంత
- కొత్తిమీర తరుగు: తగినంత
- ఉప్పు: రుచికి సరిపడా
Alu Coconut Fry: తయారీ విధానం:
1. దుంపలను ఉడికించడం:
- ముందుగా 4 బంగాళాదుంపలను సరిపడా నీళ్లలో మెత్తగా ఉడికించుకోవాలి.
- ఉడికిన తర్వాత పొట్టు తీసి, చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
2. మసాలా పొడి తయారీ:
- పాన్ వేడి చేసి అందులో 2 టీస్పూన్ల శనగపప్పు వేసి వేయించాలి.
- అది వేగాక 1 టీస్పూన్ ధనియాలు, 6 ఎండుమిర్చి, ½ టీస్పూన్ మిరియాలు వేసి వేయించుకోవాలి.
- తర్వాత తురిమిన ఎండుకొబ్బరి చిప్ప, 1 టీస్పూన్ నువ్వులు వేసి కాసేపు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
- ఈ దినుసులన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
3. పోపు & ఫ్రై చేయడం:
- అదే పాన్‌లో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి.
- నూనె కాగాక ½ టీస్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, సరిపడా ఉప్పు, ½ టీస్పూన్ పసుపు వేసి వేయించాలి.
- ఇప్పుడు ఉడికించి కోసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను వేసి, మంచి రంగు (గోల్డెన్ కలర్) వచ్చే వరకు వేయించుకోవాలి.
- దుంపలు బాగా వేగాక, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసి బాగా కలిపి మరొక 3 నిమిషాలు వేయించాలి.
4. ఫినిషింగ్:
- 3 నిమిషాల తర్వాత 1 టీస్పూన్ నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి బాగా మిక్స్ చేసి, ఒక నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి.
నోరూరించే వేడివేడి కొబ్బరి ఆలూ ఫ్రై రెడీ!
Epaper: epaper.vaartha.com

