Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పగటిపూట ఎక్కువసేపు నిద్రపోతున్నారా? అయితే ప్రమాదమే!

పగటిపూట ఎక్కువసేపు నిద్రపోతున్నారా? అయితే ప్రమాదమే!

వార్త 2 weeks ago

Health tips: వయసు పైబడిన వారిలో పగటి నిద్ర లేదా కునుకు తీయడం ఆరోగ్యానికి సంకేతం కాదని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా 55 ఏళ్లు దాటిన వారు పగటిపూట ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల ప్రాణాపాయం పొంచి ఉందని అమెరికాలోని రష్ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది.

Read Also: Eye stroke symptoms: ఐ స్ట్రోక్ సంకేతాలు.. వీటిని నిర్లక్ష్యం చేస్తే శాశ్వత అంధత్వమే!

 Health tips: Are you sleeping too much during the day? But it’s dangerous!

పగటి నిద్రతో పెరుగుతున్న మరణ ముప్పు

సాధారణంగా మధ్యాహ్నం చిన్న కునుకు తీయడం రిఫ్రెష్‌గా అనిపించినప్పటికీ, అది గంటల తరబడి సాగితే ప్రమాదకరమని ఈ అధ్యయనం పేర్కొంది. పరిశోధకుల లెక్కల ప్రకారం, పగటిపూట నిద్రపోయే ప్రతి అదనపు గంట మరణ ప్రమాదాన్ని 13 శాతం పెంచుతుంది. అలాగే, రోజులో ఒకటి కంటే ఎక్కువసార్లు కునుకు తీసే అలవాటు ఉన్నవారిలో మరణ ముప్పు 7 శాతం వరకు పెరుగుతుందని గుర్తించారు.

వైద్యుల సూచనలు

పగటిపూట అతిగా నిద్ర రావడం అనేది కేవలం అలసట మాత్రమే కాదని, అది శరీరంలో అంతర్లీనంగా ఉన్న ఏదైనా ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అందుకే, 55 ఏళ్లు పైబడిన వారు పగటిపూట తరచుగా నిద్రపోతుంటే లేదా అసాధారణంగా నిద్ర వస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

జీవనశైలిలో మార్పులు అవసరం

వృద్ధాప్యంలో రాత్రివేళ సరైన నిద్ర లేకపోవడం వల్లే పగటిపూట కునుకు తీయాల్సి వస్తుంటుంది. రాత్రి నిద్ర నాణ్యతను పెంచుకోవడం ద్వారా పగటి నిద్రను తగ్గించవచ్చని, తద్వారా ఆరోగ్య ముప్పులను నివారించవచ్చని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha