Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పలాస వద్ద ఘోర ప్రమాదం..ముగ్గురు దుర్మరణం!

పలాస వద్ద ఘోర ప్రమాదం..ముగ్గురు దుర్మరణం!

వార్త 2 weeks ago

Srikakulam Palasa Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. విశాఖపట్నం జిల్లా ఆనందపురం జాతీయ రహదారిపై జరిగిన ఘోర ప్రమాదం మరువక ముందే..

అటు శ్రీకాకుళం జిల్లాలో మరో భయంకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పలాస పరిసర ప్రాంతంలో ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

Read Also:Visakhapatnam Road Accident: లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు అక్కడికక్కడే మృతి

పెళ్లి బంధువుల కారుకు ప్రమాదం.. ముగ్గురు మృతి

పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు శ్రీకాకుళం జిల్లాలో జరగబోయే తమ బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కారులో బయలుదేరారు. కారు పలాస సమీపంలో ప్రమాదానికి గురైన వేళ.. అందులో ప్రయాణిస్తున్న పల్నాడు జిల్లా ఈవూరు మండలం ఇనుమెళ్ల గ్రామానికి చెందిన రామాంజనేయులు, మీరావళితో పాటు మరొక గుర్తుతెలియని యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇటు విశాఖ ఆనందపురం వద్ద లారీని ఢీకొట్టిన కారు బాధితులు, అటు పలాస వద్ద ప్రమాదానికి గురైన కారు బాధితులు ఇద్దరూ పల్నాడు జిల్లాకు చెందిన వారే కావడం, ఇరు కుటుంబాలు శ్రీకాకుళం జిల్లాలోనే జరగబోయే వేర్వేరు శుభకార్యాలకు వస్తుండటం గమనార్హం.

Srikakulam Palasa Road Accident:చంద్రశేఖర్ పరిస్థితి విషమం.. పోలీసుల దర్యాప్తు

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కారులోని మరో ప్రయాణికుడు చంద్రశేఖర్ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు, హైవే సిబ్బంది సహాయంతో చంద్రశేఖర్‌ను రక్షించి చికిత్స నిమిత్తం తక్షణమే సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పలాస పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. అతివేగమా లేదా డ్రైవర్ నిద్రమత్తే ఈ ఘోరానికి కారణమా అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పల్నాడులోని ఇనుమెళ్ల గ్రామంలో ఈ వార్త తెలియడంతో విషాద ఛాయలు అలముకున్నాయి.

Epaper: epaper.vaartha.com

అర్ధరాత్రి నగ్నంగా వీధుల్లో యువతీ..ఊహించని ట్విస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha