Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెళ్లయిన నెల రోజులకే నవవధువు అనుమానాస్పద మృతి

పెళ్లయిన నెల రోజులకే నవవధువు అనుమానాస్పద మృతి

వార్త 1 week ago

Visakhapatnam Crime: విశాఖపట్నం నగరంలోని పీఎంపాలెం ఆర్‌హెచ్‌ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వివాహమై కేవలం 40 రోజులు కూడా గడవక ముందే యాండ్రాపు కృష్ణవేణి (25) అనే నవవధువు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాండ్రాపు కృష్ణవేణికి, యాండ్రాపు మురళీ అనే యువకుడికి ఈ ఏడాది మే 13న ఘనంగా వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత ఈ కొత్త దంపతులు గత 20 రోజులుగా పీఎంపాలెంలోని ఆర్‌హెచ్‌ కాలనీలో ఒక అద్దె ఇంట్లో నివాసముంటున్నారు.

Read Also : AP Telangana Rain Alert: ఏపీ, తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు

 A month after the wedding, the newlyweds died suspiciously

Visakhapatnam Crime: ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన మృతదేహం

బుధవారం ఉదయం భర్త మురళీ యధావిధిగా తన విధులకు వెళ్లాడు. రాత్రి పని ముగించుకుని తిరిగి ఇంటికి చేరుకునే సరికి, కృష్ణవేణి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని అపస్మారక స్థితిలో కనిపించింది. దీన్ని చూసిన భర్త, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పీఎంపాలెం పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ సాయంతో వివరాలు, ఆధారాలు సేకరించారు. అనంతరం కృష్ణవేణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ప్రారంభించారు. పెళ్లయిన కొద్ది రోజులకే యువతి మృతి చెందడంతో ఆమె పుట్టింటి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక మలుపు.. సీఐ నాగరాజు రాజమండ్రి జైలుకు తరలింపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha