Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పంజాగుట్టలో హనీట్రాప్.. బ్లాక్‌మెయిల్‌తో లక్షలు వసూలు!

పంజాగుట్టలో హనీట్రాప్.. బ్లాక్‌మెయిల్‌తో లక్షలు వసూలు!

వార్త 6 days ago

లక్షలు దండుకున్న మహిళ… కేసు నమోదు

Panjagutta honeytrap case: హనీట్రాప్ చేసిన ఒక మహిళ బ్లాక్ మెయిల్కు పాల్పడి పౌర సరఫరాల విభాగంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసే ఉద్యోగి నుంచి లక్షల రూపాయలు వసూలుకు పాల్పడిన ఘటన పంజాగుట్ట ఠాణాలో చోటుచేసు కొంది.

పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. బాలానగర్ గాంధీనగర్కు చెందిన టి. సాయికిరణ్(29) ఖైరతాబాద్ సివిల్ సప్లైస్ విభాగంలో జూనియర్ అసి ‘స్టెంట్గా పనిచేస్తున్నాడు. 2022 జూన్ 24న ఓ మహిళ రేషన్ కార్డులో తన కుమారుడి పేరు చేర్పించాలంటూ కార్యాలయానికి వచ్చింది. నెట్ వర్క్ సమస్య కారణంగా మరుసటిరోజు రావాలని చెప్పగా, ఆమె తన పేరు లక్ష్మి అని, సైదాబాద్లో ఉంటానని చెబుతూ సాయికిరణ్ ఫోన్ నంబర్ తీసుకొని వెళ్లింది. ఆ తర్వాత వాట్సాప్ ద్వారా పరిచయం పెంచుకుని తరచూ ఫోన్లో మాట్లాడటం ప్రారంభించింది.

Read Also : Kadiri Janasena Bhairava Prasad: కదిరిలో జనసేన నేత భైరవ ప్రసాద్ అరాచకం.. భార్య, కూతురిపై దాడి

 Honeytrap blackmail on Civil Supplies employee

Panjagutta honeytrap case: ఏకాంత ఫొటోలతో బ్లాక్‌మెయిల్

సాయి కిరణ్కు సంబంధించిన వ్యక్తిగత విషయాలు తెలుసుకున్న ఆమె, తన భర్త బయట ప్రాంతంలో డ్రైవింగ్ పనిచేస్తున్నాడని చెప్పి అతనికి దగ్గరైంది. పార్కులు, రెస్టారెంట్లు, అనంతరం ఓయో హోటళ్లకు తీసుకెళ్లింది. ఆ సమయంలో అతనికి తెలియకుండా ఏకాంతంగా ఉన్న సమయంలోని ఫొటోలు తీసి హోటల్ రసీదులు సేకరించింది. దగ్గర పెట్టుకొంది. అనంతరం వాటిని చూపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, ఉద్యోగం పోగొడతానని, కుటుంబసభ్యులకు విషయం చెబుతానని బెదరిస్తూ డబ్బులు డిమాండ్ చేయడం ప్రారంభించింది. భయంతో పలుమార్లు నగదు, ఫోన్పే ద్వారా డబ్బులు చెల్లించినప్పటికీ వేధింపులు ఆగలేదు.

పోలీస్ స్టేషన్ బయటే నగదు ఇవ్వాలంటూ డిమాండ్

మానసిక ఒత్తిడికి గురై 2023 డిసెంబరు 3న ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. విషయాన్ని తెలుసుకున్న సాయికిరణ్ తల్లి లక్ష్మిని ప్రశ్నించగా, రూ.50 వేలివ్వకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదరించింది. దీంతో రూ.50 వేలు ఆన్లైన్లో పంపినప్పటికీ వేధింపులు కొనసాగడంతో 2024 మార్చి 31న తన తల్లితో కలిసి సైదాబాద్లోని ఆమె ఇంటికి వెళ్లగా, అక్కడ దుర్భాషలాడి సైదా బాద్ పోలీస్స్టేషన్కు వెళ్లి, పోలీస్ స్టేషన్ బయట రూ.2.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. భయంతో రూ.2.25 లక్షలు నగదు, రూ.25 వేలు ఫోన్పే ద్వారా సాయికిరణ్ చెల్లించాడు. ఈ నెల 13న పంజాగుట్ట ఎక్స్ రోడ్ వద్ద మరోసారి డబ్బులు డిమాండ్ చేస్తూ పరువు తీస్తానని బెదరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయికిరణ్ కుటుంబసభ్యుల సూచన మేరకు పోలీసులను ఆశ్ర యించాడు. ఆయన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు బీఎన్ఎ ఎస్ చట్టంలోని 308(2), 308(4), 318(4), 351(2), 79, 296 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha