Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ పై విమర్శలు ఆపండి.. తెలంగాణ నాయకులపై చంద్రబాబు ఫైర్!

పవన్ పై విమర్శలు ఆపండి.. తెలంగాణ నాయకులపై చంద్రబాబు ఫైర్!

వార్త 2 months ago

Chandrababu Naidu:చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా తెలంగాణ నాయకులు చేస్తున్న విమర్శల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఒక రాష్ట్రానికి చెందిన నేతలు మరొక రాష్ట్ర నాయకులను బెదిరించడం రాజకీయ సంస్కృతికి తగదని ఆయన మందలించారు. ఇలాంటి మాటలు రెండు ప్రాంతాల ప్రజల మధ్య అనవసరమైన గొడవలకు దారితీస్తాయని హెచ్చరించారు.

Read also: Pawan Kalyan Post Viral : తెలంగాణలో జనసేన ప్రస్థానంపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

 Chandrababu’s Comments on Pawan Kalyan

రాజకీయాల్లో విద్వేషం వద్దు

రాజకీయ విమర్శలు అభివృద్ధి లక్ష్యంగా ఉండాలి కానీ వ్యక్తులను లక్ష్యం చేసుకోకూడదు. పన్నెండు ఏళ్ల క్రితం రెండు రాష్ట్రాలు విడిపోయాయని, ఇప్పుడు మళ్ళీ పాత విషయాలను లేవనెత్తి ప్రశాంతతను దెబ్బతీయడం సరికాదని చంద్రబాబు (chandrababu) స్పష్టం చేశారు. ఏ నాయకుడు ఏ ప్రాంతానికి ఏం చేశారో అందరికీ తెలుసునని ఆయన గుర్తుచేశారు. అభివృద్ధి పనుల్లో పోటీ పడాలని, ప్రజా సేవలో ఎవరు గొప్పగా పనిచేస్తారో వారికే ప్రజలు పట్టం కడతారని హితవు పలికారు.

Chandrababu Naidu:ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి గుర్తింపు

తెలుగు ప్రజలు అమెరికా, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాల్లో ఉన్నతమైన రాజ్యాంగ పదవుల్లో రాణిస్తున్నారు. స్థానిక చట్టాలకు లోబడి పని చేస్తూ ఆ దేశాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. అలాంటిది మన పక్క రాష్ట్రాల మధ్యనే ఇలాంటి సంకుచిత ధోరణి ఉండటం శోచనీయం. ఒకరిని ఒకరు కించపరుచుకోవడం కన్నా ప్రజలకు మెరుగైన సేవలందించే దిశగా అడుగులు వేయాలని చంద్రబాబు కోరారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

తిరుపతి-బెంగళూరు హైవేపై భారీగా దొరికిన గంజాయి.. ఒడిశా కేటుగాళ్ల అరెస్ట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha