Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పశ్చిమ బంగ రాజకీయాల్లో కొత్త మలుపు!

పశ్చిమ బంగ రాజకీయాల్లో కొత్త మలుపు!

వార్త 1 week ago

West Bengal Politics: ఎన్డీఎకు నేతృత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు పశ్చిమ బంగ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పింది. శనివారం ఉదయం ఘడియల్లో సువేందు అధికారి ప్రమాణస్వీకారంతో కొత్తగా కొలువు తీరింది.

భారతీయ జనతాపార్టీకి మూలబిందువైన భార తీయ జనసంఘ్ పార్టీకి ప్రాణప్రతిష్ట చేసిన వ్యవస్థాప కులు శ్యామాప్రసాద్ ముఖర్జీ బెంగాల్ వాసి. 1951లో ఏర్పడిన ఈ జనసంఘ్ పార్టీయే 1980లో భారతీయ జనతాపార్టీగా రూపాంతరం చెందింది. ఒక్కో రాష్ట్రంలోనూ ప్రభుత్వాలను ఏర్పరచుకుంటూ నిన్నమొన్నటి ఎన్ని కలతో దాదాపు 21రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పర్చుకుం ది ఇంతకు ముందు ఎన్ని రాష్ట్రాలలో బిజెపి జైత్రయాత్ర సాగించినా ‘పశ్చిమ బంగ రాష్ట్రంలో జరిగిన అధికార మార్పిడికి ప్రత్యేక కారణముంది. నిన్నమొన్నటి ముఖ్య మంత్రి మమతా బెనర్జీ అహంకారమేనని చాలా విశ్లేషణ ల్లో చెప్తుంటారు. కానీ అసలు సిసలుగా చెప్పుకోవాల్సింది ఆమె వ్యవహారశైలితోపాటు చెప్పుకోవాల్సి నవి ఇంకా ఉన్నాయి.

Read Also: PM Modi Hyderabad Speech:ప్రజలు త్యాగాలు చేయాలన్న మోదీ.. విమర్శించిన రాహుల్ గాంధీ

 West Bengal Politics

West Bengal Politics: డబుల్ఇంజిన్ సర్కార్

జాతీయ భద్రత, బెంగాల్లో చొరబాట్లు, గోవుల అక్రమ రవాణా వంటి అంశాలు ఆరాష్ట్రాన్ని అతలాకుత లం చేశాయి. అందుకే ఈ రాష్ట్రాన్ని తన కనుసన్నల్లో నడిచే ‘డబుల్ఇంజిన్ సర్కార్’ రాష్ట్రంగా చేసుకోవాల్సిన ఆవశ్యకత కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడింది. బెంగాల్లో తొలి బిజెపి ముఖ్యమంత్రిగా సువేందు అధికారి చరిత్ర సృషంచారు. బెంగాలు సామాజిక అవలక్షణాలకు దూరంగా సాధారణ పరిస్థితికి తీసుకురావడానికి ఆయనకే పాలనా పగ్గాలు అప్పగించాల్సిన పరిస్థితి బిజెపికి అనివార్యం. ఎన్డీఎ పాలిత రాష్ట్రాల్లో జనతా భద్రత రీత్యా బిజెపి ముఖ్యమంత్రిని కొలువు దీర్చటమే తక్షణావశ్యకం. కొత్త ప్రభుత్వం వ్యక్తిగత అధికారం చుట్టూ తిరగకుండా ‘నేను కాదు మనం’ అనేభావనతో ప్రజలకు సేవ చేస్తుం దని ప్రమాణస్వీకారానికి ముందు కాబోయే ముఖ్యమంత్రి గా సువేందు భరోసా ఇచ్చారు. గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు భయోత్పాతానికి గుర య్యారని ఇకపై అలాంటి పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. ఒకప్పటి మమతా బెనర్జీకి ఆయన వీర విధే యుడు అయినా ఆమె వైఖరిని వ్యతిరేకించారు.

పాలకులపై నమ్మకం సన్నగిల్లింది

2020 డిసెంబరులో బిజెపిలో చేరి ఆమె హయాంలోప్రతిపక్ష నాయకునిగా ప్రజలకుఅండదండలిచ్చారు. మమతా బెనర్జీ 15 ఏళ్ల పరిపాలనలో ఆమెకు కేంద్ర ప్రభుత్వం తో తగాదాలే సరిపోయాయి. సజావుగా పరిపాలన చేయడం కన్నా ప్రతి విషయంలోనూ వివాదాస్పదంగా వ్యవహరించేవారు.. ఎన్నికల ముందు ఆమె నిర్వహించి న పాత్ర బెడిసికొట్టింది. ఏది చేసినా డ్రమెటిక్గా చేయా లనుకునే తీరు బంగ ప్రజలకు నచ్చలేదు. ఎన్నికల కమిషన్ విస్తృత ఓటర్ల తనిఖీ ప్రక్రియను ‘సర్’ కార్య క్రమంగా చేపట్టారు. దానిని ఆమె పూర్తిగా వ్యతిరేకిం చింది. చివరికి వ్యక్తిగత ధోరణిలో వ్యాఖ్యానాలు, చాలెం జీలు విసరడం ప్రజలు అంగీకరించలేదు బెంగాల్లో పరిశ్రమలవృద్ధి చెప్పుకోదగినంతగా లేదు. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాస్పద ధోరణి కారణంగా పెద్దగా పారి శ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదు. పాలకులపై నమ్మకం సన్నగిల్లింది. పాలక వర్గంపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. రాజకీయ హింస చెలరేగింది. 2 దశాబ్దాల క్రితం కమ్యూనిస్టులు పరిపాలించిన నేలపై మమతా బెనర్జీ గట్టిగానే పోరాడారు. ఆమె దూకుడును బట్టి సత్పరిపాలన అందిస్తారనే ఆశపడినప్రజలకు అడియాసే మిగిలింది.

వ్యక్తిగత ప్రతిష్ట

ప్రభుత్వ వ్యతిరేక ఓటు జమ అయింది. ప్రజలు మార్పుకోరుకున్నారు. అందుకు తగి నట్లుగానే ఓటింగ్ ప్రక్రియ జరిగింది. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాలు తమ విజయంపై ప్రభావితం చేసిందని ఆమె గొంతెత్తి అరిచారు. ఓటమి మిగిలాక కూడా ఆమె గద్దెదిగనున్నారు. రాజీనామా చేయను గాక చేయనన్నారు. మొంటి పట్టుపట్టారు. చివరికి అసెంబ్లీ రద్దుచేసి ఇకఆమెతో పనిలేదని గవర్నర్ చెప్పాల్సి వచ్చిం ది. పరాజయాన్ని ప్రజల తీర్పును హుందాగా అంగీకరించే సంయమనం కోల్పోయారు. ఎన్నికల ముందొకసారి ‘ఐప్యాక్’ ప్రతినిధులపై ఇ.డి దాడులు జరిపినప్పుడు మమత వ్యక్తిగత ప్రతిష్టకు పోగా సుప్రీంకోర్టు మందలిం చిందన్న అపప్రధ పొందారు. ఇవన్నీ ఆమె పట్ల ఏకుమేకులయ్యాయి. బంగ రాజకీయ చరిత్రలో 2026 ఎన్నికలు ఒక మార్పు. ‘సర్’ అనే విస్తృత ఓటర్ల గుర్తింపు ప్రక్రియే ఒక ముఖ్య సంస్కరణ. సంక్షేమ పథకాలద్వారా గ్రామీణ మహిళలు, రైతులు పేద వర్గాలపై మొదట్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభావితం చూపింది. ప్రధానంగా యువత సంక్షేమం కాదు. ఉద్యోగాలు కావలన్న నినాదంతో నిరు ద్యోగులు ప్రభుత్వంపై ఎదురుతిరిగారు. తమ వద్దనున్న ఓటు హక్కుతో ప్రభుత్వాన్ని మార్చదలచుకున్నారు. అదే చేశారు.

 West Bengal Politics

నిరు ద్యోగ సమస్య

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేక పోవడంతో కలిగిన నష్టాలను చవిచూసిన జనం ఈసారి బిజెపికి పట్టం కట్టారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఆదినుంచీ భావోద్వేగాలు, ప్రాంతీయ గౌరవం, సాంస్కృ తిక సౌరభం వంటి అంశాలతో ముడిపడి ఉన్నాయి. వాటిని గౌరవిస్తూ కొత్త ప్రభుత్వం పాలనలో ముందుకు సాగాలి. అధికార మార్పు ప్రతీకార రాజకీయాలకు చోటి వ్వకుండా ఉన్నప్పుడే బంగ రాజకీయాలు రాణిస్తాయి. ఒకప్పుడు భారతదేశ వాణిజ్యానికి తలమానికంగా ఉన్న కోల్కత్తా నుంచి పరిశ్రమలు తరలివెళ్లిపోయాయి. మళ్లీ పెట్టుబడుల సమన్వయంతో పరిశ్రమలు రాగలిగితే నిరు ద్యోగ సమస్య తీరగలదు. ఏది ఏమయినా పారదర్శక పాలనను బంగప్రజలు కోరుకుంటున్నారు. కొత్త ప్రభుత్వం ప్రజల్లో వివిధ సామాజిక అంశాలపట్ల విశ్వాసం కల్పించి నప్పుడే బెంగాల్సర్వతోముఖాభివృద్ధిగా సాగుతుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

SIR వల్లే బెంగాల్ లో బీజేపీకీ భారీ మెజార్టి: శశిథరూర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha