Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పశువైద్య విద్యార్థులకు శస్త్రచికిత్స నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ

పశువైద్య విద్యార్థులకు శస్త్రచికిత్స నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ

వార్త 1 week ago

Rajendranagar university:విద్యార్థులు పరిజ్ఞానంతో పాటు శస్త్రచికిత్స నైపుణ్యాలు అలవర్చుకోవాలి-జీవనో పాధి, ఔత్సాహికతాభివృద్ధి'అనే అంశంపై శిక్షణలు, విద్యార్థులు పరిజ్ఞానంతో పాటు శస్త్రచికిత్సలో నైపుణ్యాలను తప్పనిసరిగా అలవర్చుకోవాలని విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ప్రొ.

ఉదయ కుమార్ పేర్కన్నారు. బుధవారం రాజేంద్రనగర్లోని పి.వి. నరసింహరావు తెలంగాణ వశువైద్య విశ్వవిద్యాలయం, పశువైద్య కళాశాల, పశువైద్య శస్త్రచికిత్స మరియు రేడియాలజీ విభాగం ఆధ్వర్యంలో భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి షెడ్యూల్డ్ కాస్ట్ సబ్ ప్లాన్ (ఐసీఏఆర్-ఎస్సీ ఎస్పీ) ఆర్థిక సహకారంతో “చివరి సంవత్సరం బి.వి.ఎస్సీ ఏ. హెచ్, షెడ్యూల్డ్ కాస్ట్ విద్యార్థులకు మరియు క్షేత్ర పశువైద్యులకు కంపానియన్ జంతువుల ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలో జ్ఞాన, నైపుణ్యాభివృద్ధి ద్వారా జీవనో పాధి మరియు ఔత్సాహికతాభివృద్ధి’అనే అంశంపై నిర్వహిస్తు న్న ఐదు శిక్షణా కార్యక్రమాలను ప్రొ. ఉదయ కుమార్ అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నేటి పోటీ ప్రపంచంలో పశువైద్య విద్యార్థులు పాఠ్యాంశ పరిజ్ఞానంతో పాటు శస్త్రచికిత్సలో ప్రయోగించిన నైపుణ్యాలను కూడా తప్పనిసరిగా అలవర్చుకోవాలని సూచించారు.

Read also: Rega Kantha Rao Arrest : మాజీ MLA రేగా కాంతారావు అరెస్ట్?

Rajendranagar university:నాణ్యమైన విద్యతో పాటు ప్రాయోగిక శిక్షణా లక్ష్యం

కంపానియన్ జంతువుల వైద్యంలో పెరుగుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు స్వయం ఉపాధి దిశగా కూడా ముందుకు సాగాలని, ఇటువంటి నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు భవిష్యత్తులో ఉత్తమ పశువైద్య నిపుణులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పశువైద్య కళాశాల అసోసియేట్ డీన్ ప్రొ. మాధురి మాట్లాడుతూ, విద్యార్థుల కు నాణ్యమైన విద్యతో పాటు ప్రాయోగిక శిక్షణ అందించడం విశ్వవిద్యాలయం ప్రధాన లక్ష్యమని తెలిపారు. శిక్షణా కార్యక్ర మ ప్రధాన పరిశోధకులు మరియు సమన్వయకర్త ప్రొ. జె. రాధాకృష్ణారావు స్వాగతోపన్యాసం చేస్తూ, కంపానియన్ నో జంతువులలో ఆర్థోపెడిక్ సమస్యలను గుర్తించడం, నిర్ధారించస్తుడం మరియు ఆధునిక శస్త్రచికిత్సా పద్ధతులపై విద్యార్థులకు ప్రాయోగక శిక్షణ అందించడమే ప్రధాన ఉద్దేశ్యమని వివరించారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణలో ఆధుని క శస్త్రచికిత్సా విధానాలు, క్లినికల్ నైపుణ్యాలు మరియు పు ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా విద్యార్థులకు సమగ్ర అవగాహన రు. కల్పించనున్నట్లు తెలిపారు. చివరగా ప్రొ జె. రాధాకృష్ణారావు కృతజ్ఞతలు తెలుపుతూ, ముఖ్య అతిథి ప్రొ. ఉదయ కుమార్, కార్యక్రమ అధ్యక్షులు ప్రొ. డి. మాధురి, శిక్షణ కార్యక్రమ విజయవంతానికి సహకరించిన, డా. రవలి, డా. లత, డా. సిహెచ్, సత్యనారాయణ. డా. ప్రవళిక, డా. దినేష్, డా. అరవింద్లకి ధన్యవాదాలు తెలిపారు. శిక్షణ ఈ కార్యక్ర మంలో విశ్వవిద్యాలయ బోధనా సిబ్బంది, పరిశోధక విద్యా ర్థులు బి.వి.ఎస్సీ. ఏ. హె డం చ్. విద్యార్థులు పాల్గొన్నారు.

Epaper: epaper.vaartha.com

పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha