Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పటాన్చెరులో భారీ మోసం

పటాన్చెరులో భారీ మోసం

వార్త 2 months ago

న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు

Huge Fraud in Patancheru: ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే నెలకు 25 వేల రూపాయల చొప్పున 40 నెలల పాటు చెల్లించడంతోపాటు నూట పది గజాల స్థలం ఇస్తామంటూ వినియోగదారులను నిండా ముంచిన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలో చోటు చేసుకుంది.

తమకు న్యాయం చేయాలంటూ బాధితులు మీడియా ముందు వాపోయారు. బుధవారం పటాన్ చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ గోడును వెళ్లబోసుకున్నారు.

Read Also: ACB Raids Sangareddy Mee Seva: మీ సేవ కేంద్రంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు!

Huge Fraud in Patancheru: మోసం జరిగిన తీరు

పటాన్ చెరు పట్టణంలో గత 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న హేమకాంత్ రెడ్డి గత ఏడు సంవత్సరాలుగా వెస్టీజ్ అనే గొలుసుకట్టు సంస్థలో చేరి వందలాది మందిని సభ్యులుగా చేర్చి లక్షల రూపాయలు గడించాడు. కోట్ల రూపాయలు సంపాదించాలన్న దురుద్దేశంతో తనను నమ్మిన సభ్యులను మోసం చేసేందుకు కొత్త పథకాన్ని ప్రారంభించాడు.

2025లో శుభక్షేత్ర ప్రాజెక్ట్ పేరుతో తన పథకాన్ని ప్రారంభించాడు. ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే నెలకు 25 వేల రూపాయల చొప్పున 42 నెలలు చెల్లించడంతో పాటు నారాయణఖేడ్ సమీపంలోని దామరగిద్ద గ్రామంలో 102 గజాల ప్లాటు ఇస్తానని నమ్మబలికాడు. అంతేగాక కట్టినవారు మరొకరి చేత ఐదు లక్షల రూపాయలు కట్టిస్తే 5 వేల రూపాయల చొప్పున కమిషన్ చెల్లిస్తానని నమ్మబలికారు.

కోట్లాది రూపాయల వసూళ్లు

తమతో కలిసి పనిచేసిన వ్యక్తి కావడంతో 32 మంది బాధితులు ఒక కోటి 60 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. కొన్ని నెలలు ప్రతినెలా కమిషన్ చెల్లిస్తూ తదనంతరం సాకులు చెబుతూ తప్పించుకుంటూ తిరగడం ప్రారంభించాడు. అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి నిలదీస్తే ఏకంగా మకాం మార్చేసాడు. ఇదిలా ఉండగా పటాన్ చెరుతో పాటు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సుమారు 130 మంది నుండి 7 కోట్ల రూపాయలు వరకు డిపాజిట్లు సేకరించి తప్పించుకొని తిరుగుతున్నాడని బాధితులు తెలిపారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఈ కేసుకి సింగర్ మంగ్లీ కి ఎటువంటి సంబంధంలేదని, అంతా హేమకాంత్రెడ్డి నేతృత్వంలోనే మోసం జరిగిందని వారు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

కాంగ్రెస్ నేత జావీద్ దుర్మరణం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha