Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పటాన్‌చెరులో సరికొత్త ఫారెస్ట్ పార్కులు ప్రారంభించిన మంత్రి కొండ సురేఖ

పటాన్‌చెరులో సరికొత్త ఫారెస్ట్ పార్కులు ప్రారంభించిన మంత్రి కొండ సురేఖ

వార్త 2 weeks ago

Amrutavanam: పచ్చదన పరిరక్షణకు మరో ముందడుగు అమృతవనం, హరిత ద్వారం ఫారెస్ట్ పార్కులను ప్రారంభించిన మంత్రి కొండ సురేఖ పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో పటాన్‌చెరు నియోజకవర్గంలోని బొంతపల్లి గ్రామంలో అభివృద్ధి చేసిన "అమృతవనం ఎకో ఫారెస్ట్ పార్క్", మంబాపూర్ గ్రామంలోని "హరిత ద్వారం ఫారెస్ట్ పార్క్"లను తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి పార్కులలో మొక్కలు నాటి ప్రారంభోత్సవాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

Read also: Indiramma Housing Scheme : ఇళ్ల స్థలం ఉన్న పేదలకు భారీ గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల సాయం

 Amrutavanam Haritha Dwaram Forest Parks

పర్యావరణానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం

హరితహారం కార్యక్రమం ద్వారా కోట్లాది మొక్కలను నాటి తెలంగాణను హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, భవిష్యత్ తరాల సంక్షేమం కోసం పచ్చదనాన్ని పెంపొందించడం అత్యవసరమని ఆమె అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రకృతి ఒడిలో విశ్రాంతి తీసుకునేలా, కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడిపేలా ఇలాంటి ఎకో ఫారెస్ట్ పార్కులు ఉపయోగపడతాయని వివరించారు. కార్యక్రమంలో పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, పర్యావరణహిత ప్రాజెక్టులు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

Amrutavanam: పార్కుల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు

 Amrutavanam Haritha Dwaram Forest Parks

అమృతవనం, హరిత ద్వారం పార్కులు స్థానిక ప్రజలకు మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల వారికి కూడా ఆకర్షణీయ కేంద్రాలుగా మారనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్కులలో నడక మార్గాలు, విశ్రాంతి వేదికలు, సుందరమైన పచ్చదనం, వివిధ రకాల మొక్కలు, పక్షులకు అనుకూలమైన వాతావరణం వంటి సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పర్యావరణ అవగాహన పెంపొందించేందుకు విద్యార్థులకు ప్రకృతి విద్యా కేంద్రాలుగా కూడా ఈ పార్కులు ఉపయోగపడనున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్కుల ప్రారంభంతో తమ ప్రాంతానికి మరింత గుర్తింపు లభిస్తుందని, పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha