Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై జగన్ రియాక్షన్ ఇదే.. ఏమన్నారంటే?

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై జగన్ రియాక్షన్ ఇదే.. ఏమన్నారంటే?

వార్త 2 months ago

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ, మానవత్వంతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

అస్వస్థతకు గురై శస్త్రచికిత్స చేయించుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆయన కోరుకున్నారు.తద్వారా రాజకీయంగా తమ మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా వ్యక్తిగత విషయాల్లో స్పందించేందుకు మాత్రం అవేవీ అడ్డంకులు కావని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లయింది. గతంలో జగన్ పుట్టిన రోజులకు చంద్రబాబు, పవన్, అలాగే వారి పుట్టినరోజులకు ఆయన శుభాకాంక్షలు కూడా చెప్పుకుంటూనే ఉన్నారు.

Read Also:Kakarla Ranganath: అర్జాస్ స్టీల్ ప్లాంట్ మా కన్నతల్లి లాంటిది

Pawan Kalyan: వైద్యుల సూచన

కాగా, పవన్ కల్యాణ్‌కు శనివారం (ఏప్రిల్ 18) సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. శుక్రవారం ఉదయం తన శాఖకు సంబంధించిన అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఆయన ఇబ్బందిపడుతున్నారు. దీంతో పవన్ వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారం నాటి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎంఆర్‌ఐ కూడా నిర్వహించారు.

వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి శస్త్రచికిత్స చేశారు. వా నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు.అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పినట్లు పవన్ రాజకీయ కార్యదర్శి పి.హరి ప్రసాద్ వెల్లడించారు. ప్రస్తుతం పవన్ అభిమానులు, పార్టీ శ్రేణులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి: కేటీఆర్ ఆకాంక్ష

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha