Pawan Kalyan : తెలంగాణ వేదికగా జనసేన పార్టీ సభ ఏర్పాటు చేయడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర వివాదం, విమర్శలు చెలరేగుతున్న నేపథ్యంలో, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు తెలుగుదేశం పార్టీ (TDP) సీనియర్ నేత రఘురామకృష్ణరాజు (RRR) పూర్తి మద్దతు ప్రకటించారు.
ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమే అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ “నాలుక కోస్తామంటూ” కొందరు నేతలు బహిరంగంగా హెచ్చరించడం, బెదిరింపులకు దిగడం అత్యంత దారుణమని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి భయానక వాతావరణాన్ని, బెదిరింపు రాజకీయాలను ఆధునిక సమాజంలో ప్రజలు ఎంతమాత్రం సహించబోరని రఘురామ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కేవలం ఒక సినిమా నటుడే కాదని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం, వారి శ్రేయస్సు కోసం అనునిత్యం శ్రమిస్తున్న నిబద్ధత గల నాయకుడని ఆయన కొనియాడారు.
Read Also : పవన్ కంటే తనకే ఎక్కువ అర్హత ఉందంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే !!

ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు అందరికీ ఉంది.. రఘురామ స్పష్టీకరణ
తెలంగాణ సమాజంపై, ఇక్కడి ప్రజలపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరికీ వారి సమస్యలపై మాట్లాడే హక్కు ఉంటుందని రఘురామకృష్ణరాజు ఈ సందర్భంగా గుర్తుచేశారు. అవసరమైతే ప్రజల పక్షాన నిలబడి పోరాడే హక్కు, స్వేచ్ఛ రాజ్యాంగం ప్రకారం అందరికీ లభిస్తుందని, దానిని ఎవరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం సరికాదని, పవన్ కళ్యాణ్ అజెండా కేవలం ప్రజా సంక్షేమమేనని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో జనసేన సభల నిర్వహణను అడ్డుకోవాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, బెదిరింపులకు భయపడే నాయకుడు పవన్ కళ్యాణ్ కాదని రఘురామకృష్ణరాజు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
నీ సొల్లు కబుర్లు..అక్కడ చెప్పుకో - పొన్నం కు బొలిశెట్టి కౌంటర్

