Pawan Kalyan : తెలంగాణ కాంగ్రెస్, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రెస్ మీట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్ గురించి మాట్లాడే అర్హత తనకు లేదంటూ కొందరు చేస్తున్న విమర్శలపై ఆయన తీవ్రంగా స్పందించారు. “నేను తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి జడ్చర్ల నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించాను. కానీ పవన్ కల్యాణ్ గతంలో రెండు స్థానాల్లో (గాజువాక, భీమవరం) పోటీ చేసి రెండింటిలోనూ ఘోరంగా ఓడిపోయారు. ఈ లెక్కన ప్రజాస్వామ్యంలో ఓడిన పవన్ కంటే, గెలిచిన నాకే ఎక్కువ అర్హత ఉన్నట్లే కదా!” అని అనిరుధ్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Read Also: తెలంగాణపై పూర్తి కమిట్‌మెంట్ ఉంది.. విమర్శకులపై పవన్ ఫైర్

పవన్ పర్యటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రశ్నల వర్షం
ఎన్నికల అర్హతలతో పాటు పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన ఒక వ్యాఖ్యను ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను ఇటీవల సింగపూర్ వెళ్లానంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రభుత్వ అధికారితో అన్నట్లుగా వచ్చిన వార్తలపై ఆయన మండిపడ్డారు. పవన్ కల్యాణ్ తన సొంత కొడుకును చూసేందుకు సింగపూర్ వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారా? అని ప్రశ్నించారు. అది కూడా ప్రజా ధనంతో, ప్రభుత్వ ఖర్చులతో ఈ పర్యటనకు సిద్ధమయ్యారా అంటూ అనిరుధ్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ తెలంగాణ పట్ల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇరు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

