Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

వార్త 3 weeks ago

Ponnam Prabhakar: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, ఆ తర్వాతే ఇక్కడ రాజకీయ సభలు నిర్వహించుకోవాలని తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించడాన్ని తాము ఎక్కడా అడ్డుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. అయితే, తెలంగాణ ప్రజలకు ఎంతో సెంటిమెంట్ అయిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే హైదరాబాద్ వేదికగా పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా సభ నిర్వహించాలని అనుకోవడంపై మంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

 Janasena Telangana Meeting

Read also:Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన పవన్ కళ్యాణ్

పవన్ సభకు నిరాకరించిన పోలీసులు.. ప్రెస్ మీట్ పెట్టిన జనసేనాని

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి వేదికగా ‘నవ నిర్మాణ సంకల్ప సభ’ పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించడానికి పవన్ కల్యాణ్ ప్లాన్ చేశారు. అయితే, నగరంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు ఈ సభకు అనుమతి ఇవ్వలేదు. దీంతో సభ కాస్తా రద్దు కాగా.. జనసేనాని జూబ్లీహిల్స్‌లోని తన సొంత నివాసంలోనే జర్నలిస్టులతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడాల్సి వచ్చింది.

Ponnam Prabhakar: ‘పెయిడ్ ఆర్టిస్ట్’ అంటూ తీవ్ర విమర్శలు.. వెనుక ఎవరి చిట్టీలు ఉన్నాయి?

ఈ పరిణామాలపై హుస్నాబాద్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్, జనసేనానిపై పదునైన విమర్శలు గుప్పించారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇక్కడి ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా పవన్ వ్యవహరించారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి, తెలంగాణ సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న ఆవిర్భావ దినోత్సవం నాడే ఎలా సభ పెడతారని నిలదీశారు. పవన్‌ను ఒక ‘పెయిడ్ ఆర్టిస్ట్’గా అభివర్ణించిన పొన్నం.. ఆయన ప్రస్తుత పర్యటన వెనుక బీజేపీ లేదా బీఆర్ఎస్ పార్టీల అజెండా ఏమైనా ఉందా, వారి నుంచి ఏమైనా చిట్టీలు అందుతున్నాయా అని అనుమానం వ్యక్తం చేశారు.

ప్రొటోకాల్ ఇచ్చి గౌరవించాం.. కానీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు

నాలుగు నెలల క్రితం పవన్ కల్యాణ్ తెలంగాణకు వచ్చిన సమయంలో తమ ప్రభుత్వం ఆయనకు తగిన ప్రోటోకాల్ కల్పించి సాదరంగా ఆహ్వానించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఆయన ఎక్కడైనా తిరగొచ్చని, దానికి ఎవరూ అడ్డుచెప్పరని స్పష్టం చేశారు. కానీ ఇక్కడి ప్రజల భావోద్వేగాలను, ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. ప్రజా గాయకుడు గద్దరన్నకు సంబంధించి పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. వాటన్నింటిపై పవన్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.

ఏపీ ప్రజలను ఎల్లప్పుడూ స్వాగతిస్తాం

తెలంగాణ గడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎప్పుడూ ఆదరిస్తుందని, వారిని తాము ఎంతగానో స్వాగతిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఏపీ ప్రజలకు ఏం పని అనే భావన తమకు ఏమాత్రం లేదని వ్యాఖ్యానించారు. తాము కేవలం తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ఇక్కడి ప్రజల సెంటిమెంట్లను గౌరవించాలని మాత్రమే కోరుకుంటున్నామని, విద్వేషాలకు తావులేకుండా రాజకీయాలు చేయాలని హితవు పలికారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

ఆంధ్రాలోనే దిక్కులేదు.. తెలంగాణలో సీఎం ఎలా అవుతా?..పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha