Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

వార్త 3 weeks ago

Pawan - Komati Reddy : జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సినిమాటోగ్రఫీ, రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అత్యంత పదునైన రీతిలో స్పందించారు.

పవన్ కల్యాణ్ తెలంగాణ గడ్డపైనే నిలబడి, ఈ ప్రాంతంపై తనకున్న అక్కసును వెళ్లగక్కారని మంత్రి మండిపడ్డారు. తెలంగాణ పట్ల ఆంధ్రప్రదేశ్ నాయకులకు ఇంకా ఎంత వివక్ష ఉందో పవన్ మాటలను బట్టి స్పష్టమవుతోందని ధ్వజమెత్తారు. “తెలంగాణ మీ అయ్య జాగీరా?” అంటూ జనసేన శ్రేణులు వాడుతున్న భాషను చూస్తుంటే ఇక్కడి ప్రజల రక్తం మరుగుతోందని కోమటిరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.

Read Also : పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

ఏపీ కాంట్రాక్టర్లపై సంచలన నిర్ణయం

ఈ వివాదం నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక సంచలన ప్రకటన చేశారు. తెలంగాణపై టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మళ్లీ పాత కుట్రలను తెరపైకి తెస్తున్నాయనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే ఇకపై ఆంధ్రా ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్లకు తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. స్థానిక వనరులు, అవకాశాలు తెలంగాణ ప్రజలకే దక్కాలనే సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. పవన్ కల్యాణ్ జాతీయవాదం వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వడం, దానికి జనసేన నేతలు స్పందించడం.. ఇప్పుడు దానికి ప్రతిగా మంత్రి కోమటిరెడ్డి ఆంధ్రా కాంట్రాక్టర్లను టార్గెట్ చేస్తూ మాట్లాడటంతో ఈ వివాదం రెండు రాష్ట్రాల మధ్య సరికొత్త ప్రాంతీయ చిచ్చుకు దారితీసేలా కనిపిస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

నీ సొల్లు కబుర్లు..అక్కడ చెప్పుకో - పొన్నం కు బొలిశెట్టి కౌంటర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha