Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి

వార్త 3 weeks ago

Jagadish Reddy: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన విలేకరుల సమావేశంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటల్లో ఎలాంటి అర్థం లేదని, అంతా గందరగోళంగా ఉందంటూ మండిపడ్డారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఇలాంటి తెలివితక్కువ వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం, పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసి రాష్ట్రంలో ఒక పెద్ద రాజకీయ డ్రామాకు తెరలేపారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

 Pawan Kalyan Press Meet

Read also: CM Revanth To Visit Palamuru : రేపు పాలమూరులో సీఎం రేవంత్ పర్యటన

సభపై ఆంక్షల వెనుక పెద్ద కుట్ర.. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు

తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు రాష్ట్ర ప్రభుత్వం రకరకాల ఆంక్షలు విధించడం వెనుక ఒక లోతైన కుట్ర దాగి ఉందని జగదీశ్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి, జనసేన అధినేతకు మధ్య లోపాయికారీ ఒప్పందం (మ్యాచ్ ఫిక్సింగ్) నడుస్తోందని, ఈ ఆంక్షల ఉదంతంతో ఆ విషయం తెలంగాణ ప్రజలకు కళ్లకు కట్టినట్లు స్పష్టమైందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Jagadish Reddy: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ హైడ్రామా

ప్రస్తుతం తెలంగాణలో అనేక ప్రజా సమస్యలు ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని జగదీశ్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను, వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రజల దృష్టిని వేరే వైపు తిప్పేందుకు ఈ కొత్త హైడ్రామాను నడుపుతున్నారని దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్, కాంగ్రెస్ నేతలు ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ వివాదాన్ని సృష్టించారని, కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాలు మరియు లబ్ధి కోసమే ఇదంతా చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

పవన్ కళ్యాణ్ ను బెదిరించడం దారుణం - రఘురామ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha