Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ తెలంగాణ పర్యటన పై పేర్ని నాని సెటైర్లు

పవన్ తెలంగాణ పర్యటన పై పేర్ని నాని సెటైర్లు

వార్త 2 weeks ago

Pawan Kalyan visits ailing fan Niranjan in Telangana : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటించి ఒక బాలుడిని పరామర్శించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

పవన్ కళ్యాణ్ ప్రవర్తన విడ్డూరంగా ఉందంటూ ఆయన తనదైన శైలిలో సెటైర్లు వేశారు. సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అనేక సమస్యలతో జనసైనికులు, సామాన్య ప్రజలు కొట్టుమిట్టాడుతుంటే వారిని పట్టించుకోని డిప్యూటీ సీఎం.. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఎవరో ఒక బాలుడికి ఒంట్లో బాగాలేదని తెలియగానే అంత దూరం పరిగెత్తుకుంటూ వెళ్లడం వెనుక ఉన్న ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడి ప్రజల కష్టాలను పవన్ పూర్తిగా విస్మరించారని పేర్ని నాని ఆరోపించారు.

Read Also : ఇద్దరం కలిసి 'OG' చూద్దాం.. నిరంజన్ కు పవన్ హామీ

ఏపీ ప్రజల కన్నీళ్లు పవన్‌కు కనిపించడం లేదా?.. ఆస్తుల లూటీపై నిలదీత

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ వైఖరిని పేర్ని నాని తీవ్రంగా ఎండగట్టారు. “ఇక్కడ ఏపీలో తన కొడుకు అన్యాయంగా చనిపోయాడని ఒక కన్నతల్లి గుండెలవిసేలా ఏడుస్తుంటే ఆ కన్నీళ్లు డిప్యూటీ సీఎంకు కనపడటం లేదు.. ఇళ్లు నేలమట్టం చేసి రోడ్డున పడేశారని పేదలు నెత్తీనోరూ బాదుకుంటుంటే ఆ ఆవేదన ఆయనకు వినపడటం లేదు” అంటూ ధ్వజమెత్తారు. అంతేకాకుండా, సొంత పార్టీ అయిన జనసేన కార్యకర్తలే (జనసైనికులు) తెలుగుదేశం పార్టీ (TDP) నాయకులు తమ ఆస్తులను బలవంతంగా లాక్కుంటున్నారని నెత్తీ నోరూ మొత్తుకుంటున్నా పవన్ కళ్యాణ్ కనీసం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సొంత రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, ప్రజా సమస్యలను గాలికొదిలేసి పక్క రాష్ట్రాల్లో పరామర్శల రాజకీయం చేయడం పవన్‌కే చెల్లిందంటూ ఘాటుగా ఎద్దేవా చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి నష్టం: అచ్చెన్నాయుడు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha