Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ కళ్యాణ్‌కు కేవీపీ రామచంద్ర రావు బహిరంగ లేఖ

పవన్ కళ్యాణ్‌కు కేవీపీ రామచంద్ర రావు బహిరంగ లేఖ

వార్త 1 week ago

AP Politics:రాజకీయాల్లో మాటల యుద్ధం ముదురుతోంది. పవన్ కళ్యాణ్ పై కేవీపీ రామచంద్రరావు సవాల్ విసురుతూ బహిరంగ లేఖ రాశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తనపై అక్రమ కేసులు పెట్టారని పవన్ చేసిన ఆరోపణలు అవాస్తవమని కేవీపీ స్పష్టం చేశారు.

స్వార్థపూరిత రాజకీయాల కోసం ఇలాంటి అసత్యాలు ప్రచారం చేయడం సరికాదని ఆయన హెచ్చరించారు.

Read also: Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు అస్వస్థత.. క్యాబినెట్ భేటీలో ఏం జరిగింది?

లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా

వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పై ఎటువంటి తప్పుడు కేసులు బనాయించలేదని కేవీపీ తేల్చిచెప్పారు. పవన్ పేర్కొన్న పోలీసు అధికారిని లై డిటెక్టర్ పరీక్షకు పంపాలని ఆయన కోరారు. తన ఆరోపణలు నిజమని నిరూపిస్తే పది కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కు లేదా పవన్ కి నచ్చిన స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తామని ప్రకటించారు.

AP Politics:అసత్య ఆరోపణలు తగదు

ప్రజల ఆదరణ పొందిన నాయకుడిపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని కేవీపీ సూచించారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తు రాజకీయ ప్రణాళికల గురించి ఆలోచించే సమయం వైఎస్సార్ కు లేదని ఆయన గుర్తుచేశారు. ఈ సవాల్ కు పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారో లేదో వేచి చూడాలి. రాజకీయాల్లో విమర్శలు చేసేటప్పుడు వాస్తవాలను తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha