Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవిత్ర సంగమంలో కృష్ణమ్మకు 'జలహారతి' ఇచ్చిన సీఎం చంద్రబాబు

పవిత్ర సంగమంలో కృష్ణమ్మకు 'జలహారతి' ఇచ్చిన సీఎం చంద్రబాబు

వార్త 3 weeks ago

Pavitra Sangamam Ibrahimpatnam: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని కృష్ణా-గోదావరి పవిత్ర సంగమ క్షేత్రం వద్ద బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దేశ సాగునీటి రంగంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల జలవనరుల అభివృద్ధిలో విశేష సేవలందించిన ప్రముఖ దిగ్గజ ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు 124వ జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవిత్ర సంగమ ఘాట్ వద్ద నదులకు హారతి ఇచ్చి, జలసిరిని కాపాడుకుంటామని సీఎం సంకల్పం చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. అపర భగీరథుడు, గొప్ప మేధావి అయిన కేఎల్ రావు సేవలను కొనియాడారు. ఆయన అందించిన సాంకేతిక స్ఫూర్తిని, సాగునీటి రంగంపై ఆయనకున్న దార్శనికతను నేటి తరానికి అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. కేఎల్ రావు ఆశయాలను, ఆయన స్ఫూర్తిని రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి తీసుకెళ్లేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి, నిర్వహిస్తుందని సీఎం అధికారికంగా ప్రకటించారు.

Read Also : Makkena Prasanna: అమెరికాలో ఘోర ప్రమాదం.. వినుకొండ యువతి మక్కెన ప్రసన్న దుర్మరణం!

 CM Chandrababu performs 'Jalaharati' to the Krishna River at the holy confluence.

Pavitra Sangamam Ibrahimpatnam: డెల్టాను కాపాడుతున్నది పట్టిసీమ నీళ్లే!

పూర్వం సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం ఆనకట్ట, ప్రకాశం బ్యారేజీలను కేఎల్ రావు తన అద్భుత ఇంజనీరింగ్ నైపుణ్యంతో ఆధునీకరించారని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ఆయన చేసిన ఈ ఆధునీకరణ పనుల వల్లే గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాలు నేడు సస్యశ్యామలంగా మారి, కోటి ఎకరాల మాగాణంగా విరాజిల్లుతున్నాయని కొనియాడారు. నీటి విలువ తెలిసిన ప్రాజెక్టుల రూపశిల్పి ఆయనని ప్రశంసించారు.

నదుల అనుసంధానంలో భాగంగా తమ ప్రభుత్వం గతంలో చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రాధాన్యతను ఈ సందర్భంగా చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. కరవు కాలంలోనూ, నీటి కొరత ఉన్న సమయంలోనూ కృష్ణా డెల్టా ఆయకట్టును, ఇక్కడి పంటలను కాపాడుతున్నది పట్టిసీమ ద్వారా వస్తున్న గోదావరి నీళ్లేనని ఆయన స్పష్టం చేశారు. నీటి సంరక్షణ, ప్రాజెక్టుల పూర్తిపై తమ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని సీఎం పునరుద్ఘాటించారు.

కడపలో దాల్మియా సిమెంట్ విస్తరణ.. శంకుస్థాపన చేసిన మంత్రి లోకేశ్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha